
‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోగా ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ‘మ్యాడ్’ (MAD) ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. కానీ ఎందుకో సినిమా ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. ‘కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ పై నవీన్ పోలిశెట్టి సంతృప్తి చెందనందున.. ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది’ అని గాసిప్స్ వినిపించాయి.
Naveen Polishetty
మరోపక్క అనిరుధ్ ఆ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను తోసిపుచ్చాడు నవీన్ పోలిశెట్టి. అయితే ‘అనగనగా ఒక రాజు’ ప్రాజెక్టు ఉంటుందని మాత్రం అతను క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో డైరెక్టర్ ని హర్ట్ చేయకుండా నిర్మాత నాగవంశీ ‘మ్యాడ్’ అనే చిన్న సినిమా చేసుకునే అవకాశం ఇచ్చాడు. అది సక్సెస్ అయ్యింది. ఆ రిజల్ట్ చూసి అయినా నవీన్..
‘అనగనగా ఒక రాజు’ ప్రాజెక్టుకి అంగీకరిస్తాడేమో అని అంతా ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే కళ్యాణ్ పై నమ్మకంతో నాగవంశీ ‘మ్యాడ్ స్క్వేర్’ చేసుకునే అవకాశం కల్పించాడు. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంకా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు నవీన్ పోలిశెట్టి. అతని చేతికి గాయం అవ్వడంతో..
తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డిలే అవుతున్నట్టు వివరణ ఇచ్చాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో ‘ఆయ్’ (AAY) దర్శకుడు అంజి మణిపుత్రతో నవీన్ ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా గోదావరి బ్యాక్ డ్రాప్లోనే ఉంటుందని వినికిడి. సో ‘అనగనగా ఒక రాజు’ ఇక ఇప్పట్లో లేనట్టే అని స్పష్టమవుతుంది.