March 23, 202506:19:21 AM

Chiranjeevi: ఏపీ సీఎం చంద్రబాబుకు సాయం చెక్కు అందజేసిన చిరంజీవి

భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సాయం అందించడానికి సినిమా సెలబ్రిటీలు చాలామంది ముందుకు వచ్చారు. ఆ సమయంలో చెరో రూ. 50 లక్షలు ప్రకటించిన మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)  .. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) ఆ చెక్కులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో కలసి చిరంజీవి చెక్కులు అందజేశారు. దీనికి సంబంధించిన వివరాలు, ఫొటోలను చంద్రబాబు నాయుడు తన ఎక్స్‌ (మాజీ ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశారు.

Chiranjeevi

ఈ క్రమంలో వరద సాయం చేసిన చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని, తన మానవతా దృక్పథాన్ని చూపిస్తుంటారని.. ఇప్పుడు చిరంజీవి అందించిన సాయం.. బాధితులకు అవసరమైన సాయం చేయడానికి ఉపయోగపడ్డాయని సీఎం తెలిపారు. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌తీసారి సినీ ప‌రిశ్ర‌మ నుండి త‌న వంతు మ‌ద్దతుని చిరంజీవి కుటుంబం ఇస్తూనే ఉంటుంది.

ఈ క్రమంలో విజయవాడ ప్రాంతంలో ఇటీవల వరదల వల్ల ఇబ్బందులు పడిన వారి కోసం ఏపీ ప్రభుత్వానికి చెరో రూ. 50 లక్షలు ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఖమ్మం జిల్లాలో వరదల వల్ల నష్టాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి చెరో రూ. 50 లక్షలు అనౌన్స్‌ చేశారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రికి చెక్కులు అందజేసిన విషయం తెలిసిందే.

విరాళం చెక్కులు అందించడానికి తన నివాసానికి వచ్చిన చిరంజీవికి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికాఉ. భేటీ అనంతరం చిరంజీవి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు చంద్రబాబు కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు. చిరంజీవి, చరణ్‌ మాత్రమే కాదు.. ఇతర మెగా ఫ్యామిలీ హీరోలు ఇప్పటికే అనౌన్స్‌ చేసిన సాయాన్ని అందజేసిన విషయం విదితమే.

గోపీచంద్ ‘విశ్వం’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.