March 22, 202507:59:03 AM

Dulquer Salmaan: 43 సినిమాలు చేశాక.. దుల్కర్‌ ఇప్పుడు గ్యాప్‌ ఎందుకు తీసుకుంటున్నాడు?

దుల్కర్‌ సల్మాన్‌ను (Dulquer Salmaan) కెరీర్‌ను చూస్తుంటే.. మన హీరోల ఫ్యాన్స్‌కి చిన్న అసూయ ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన కెరీర్ స్పాన్‌కి, ఆయన చేసిన సినిమాల కౌంట్‌కి అస్సలు సంబంధం ఉండదు. ఆయన కెరీర్‌ నిడివి ఉన్న మన హీరోలు ఆయనన్ని సినిమాలు చేయలేదు. డౌట్‌గా ఉంటే ఆయన ఫిల్మోగ్రఫీ చూడండి. 12 ఏళ్ల కెరీర్‌లో 43 సినిమాలు చేశాడు. మనవాళ్లు 30ల దగ్గరే ఉన్నారు. ఆ విషయం పక్కనపెడితే.. ఇప్పుడు దుల్కర్‌ కాస్త స్లో అయ్యారు.

Dulquer Salmaan

దీని గురించి ఆయన దగ్గరే ప్రస్తావిస్తే ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. ‘మహానటి’తో తెలుగువారికి పరిచయమై దుల్కర్‌ సల్మాన్‌ తన కొత్త చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాను దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కెరీర్ గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు దాటుతోంది. ఇప్పటివరకూ 43 సినిమాల్లో నటించా.

అసలు ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు సమయంలో నేను ఇక్కడ రాణించగలుగుతానా.. నన్ను ఆదరిస్తారా.. అసలు నన్ను రెండున్నర గంటలు స్క్రీన్‌ మీద చూస్తారా అని అనుకున్నాను. అలాంటి నేను వరుస సినిమాలు చేఅఆను. అయితే గత రెండేళ్ల నుండి కాస్త నెమ్మదించాను. గతేడాది ఒక్క సినిమానే చేశాను. అయితే ఇది ఎవరి తప్పూ కాదు. ఇటీవల నేను నటించిన కొన్ని సినిమాలు సరైన ఫలితం ఇవ్వలేదు. అలాగే నా ఆరోగ్యమూ అంత గొప్పగా లేదు. దీంతో బ్రేక్‌ తీసుకున్నాను అని దుల్కర్‌ క్లారిటీ ఇచ్చాడు.

గతేడాది దుల్కర్‌ నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ సినిమామిశ్రమ స్పందనలు అందుకుంది. ఆ సినిమా మీద ఆయన భారీ నమ్మకమే పెట్టుకున్నాడు. ఆ ఫలితమే గ్యాప్‌కు కారణమని మాటల్లో అర్థమవుతోంది. ఇక పైన చెప్పిన ‘లక్కీ భాస్కర్‌’ సినిమా విషయానికి వస్తే.. 1980- 90 నేపథ్యంలో ఓ బ్యాంక్‌ క్యాషియర్‌ అసాధారణ ప్రయాణం ఈ సినిమా. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.

ఏకంగా అన్ని నెలలు వాయిదా వేస్తున్నారా.. కారణం?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.