March 16, 202511:32:22 AM

Kalki: 1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాకి ఇలాంటి తిప్పలు ఏమిటో.!

“ఏడు సముద్రాలు ఈది ఇంటి ముందు కాలువలో పడి పోయాడంట” అనే సామెత ఇప్పుడు “కల్కి”  (Kalki 2898 AD)  విషయంలో నిజం అయ్యేలా ఉంది. ప్రభాస్  (Prabhas)  , కమల్ హాసన్ (Kamal Haasan) , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , దీపిక పదుకొనె (Deepika Padukone) వంటి సూపర్ స్టార్లు నటించిన “కల్కి” చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అటువంటి సినిమాకి ఓటీటీ రైట్స్ విషయంలో అగ్ర సంస్థలన్నీ పోటీపడి మరీ కోట్లు పెట్టి కొన్నాయి.

Kalki

అటువంటి సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం ఇప్పటికీ అవ్వలేదంట. ఈ విషయం తెలిసి చాలామంది షాక్ అయ్యారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఓటీటీ రిలీజుల కారణంగానే ఈ తరహా పెద్ద సినిమాలకు శాటిలైట్ బిజినెస్ అనేది తగ్గిపోయింది. ఓటీటీలో యాడ్స్ లేకుండా హ్యాపీగా పాజ్ చేసుకొని మరీ చూసే సినిమాను.. టీవీలో యాడ్స్ తో చూడ్డానికి జనాలు కూడా ఇష్టపడట్లేదు.

ఆ కారణంగానే “కల్కి” నిర్మాతలు చెబుతున్న రేట్లకు, ఆ సినిమా శాటిలైట్ రైట్స్ ను కొనడానికి ఏ శాటిలైట్ సంస్థ కూడా ముందుకు రావడం లేదు. ఆల్రెడీ “నెట్ ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్” యాప్స్ లో ఉన్న ఈ సినిమా టీవీలో ఎప్పుడొస్తుందా అనేది జనాలు కూడా పట్టించుకోవడం లేదు.

ఈ క్రమంలో.. “కల్కి” టీవీల్లో రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అయితే.. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు చిన్నపాటి అవమానంగా ఫీల్ అవుతుండగా, మిగతా హీరోల ఫ్యాన్స్ ఎప్పట్లానే ట్రోల్ చేస్తున్నారు. మరి కల్కి నిర్మాతలు ఈ విషయంలో త్వరగా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే మంచిది.

‘యుఫోరియా’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.