March 28, 202503:46:54 AM

Naga Chaitanya, Sobhita: ‘తండేల్’ రిలీజ్ కి ముందే చై- శోభిత..ల పెళ్లి?

నాగ చైతన్య  (Naga Chaitanya) – శోభిత (Sobhita Dhulipala) ..లు ఈ మధ్యనే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున (Nagarjuna) ఇంట్లో చాలా సింపుల్ గా ఈ వేడుకని నిర్వహించారు. నాగ చైతన్య ఇదివరకే సమంతని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ మనస్పర్థల కారణంగా వీళ్ళు 4 ఏళ్లకే విడిపోయారు. 3 ఏళ్లుగా సింగిల్ గా ఉంటూ వస్తున్న నాగచైతన్య హీరోయిన్ శోభితతో డేటింగ్లో ఉన్నదంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ చైతన్య కానీ శోభిత కానీ వీటిపై ఓపెన్ అవ్వలేకపోయారు.

Naga Chaitanya, Sobhita

అందుకు కారణాలు తెలీదు కానీ.. చైతన్య విదేశాలకి ట్రిప్..లు వేస్తే, శోభిత కూడా అదే ప్లేస్లో నుండి ఫోటోలు చేస్తూ వచ్చేది. వీటిపై సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరిగితే.. వాళ్ళు పరోక్షంగా మండిపడేవారు. దీంతో వాళ్ళ పై నెటిజన్లు ఫోకస్ పెట్టడం మానేశారు. సరిగ్గా అలాంటి టైంలో ఎంగేజ్మెంట్ చేసుకుని షాకిచ్చారు చై- శోభిత..లు. నిండు మనస్సుతో శోభితని మా ఫ్యామిలీలో కలుపుకుంటున్నాం అంటూ నాగార్జున తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే ఎంగేజ్మెంట్ అయ్యి నెలలు కావస్తున్నా.. పెళ్లి విషయంలో చై- శోభిత క్లారిటీ ఇవ్వలేదు. చాలా సింపుల్ చైతన్య రెండో పెళ్లి వేడుకని జరపాలని నాగార్జున చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్లోనే చై- శోభిత..ల పెళ్లి వేడుక జరిగే అవకాశం ఉంది. ఇక పెళ్లి డేట్ ఎప్పుడనే విషయం పై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ… డిసెంబర్ 4 కి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.