March 25, 202510:14:31 AM

Prabhas: బాలీవుడ్ మల్టీస్టారర్.. లేట్ చేయకుండా రిజెక్ట్ చేసిన ప్రభాస్

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉండటంతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలనే ఆలోచనలు చాలా మంది దర్శకనిర్మాతల్లో కనిపిస్తున్నాయి. మరోవైపు, క్రేజీ కాంబినేషన్లు, మల్టీ యూనివర్స్ సినిమాలు ట్రెండ్ లోకి రావడంతో ఇలాంటి సినిమాల్లో ప్రభాస్‌ను చూడాలనేది అభిమానుల కల. అయితే, ఈ మధ్యే ప్రభాస్ ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Prabhas

మైత్రీ మూవీ మేకర్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ, బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) తో కలిసి ప్రభాస్ తో భారీ స్థాయి ప్రాజెక్ట్ చేయాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ ఇటీవల బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో (Shah Rukh Khan) చేసిన ‘పఠాన్’ సినిమా సక్సెస్ తరువాత ఆయనపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ విజయంతో సిద్దార్థ్ మరో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ ఒక ప్రధాన పాత్రలో ఉండగా, మరో కీలక పాత్రకు ప్రభాస్‌ను తీసుకోవాలని అనుకున్నారు.

కానీ, ఈ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ (Prabhas)  ఒక్క సిట్టింగ్ లోనే మరొక ఆలోచన లేకుండా “నో” చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మల్టీస్టారర్ కాన్సెప్ట్ లో సినిమాలు చేయాలనేది తన ప్రాధాన్యం కాదని ప్రభాస్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సోలో హీరోగా తన ఇమేజ్‌ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ క్రేజీ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు టాక్.

ఇక సిద్దార్థ్ ఆనంద్ కి మళ్ళీ ఒక సోలో స్క్రిప్ట్‌తో రావాలని సూచించినట్లు టాక్. ప్రస్తుతం ప్రభాస్ మారుతి (Maruthi Dasari)  దర్శకత్వంలో ‘రాజా సాబ్, (The Rajasaab)  ‘ హను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అలాగే 2025 లో ప్రారంభం కానున్న సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  డైరెక్షన్ లో ‘స్పిరిట్ (Spirit),’ నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ‘కల్కి 2’ (Kalki 2898 AD)ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి.

మొత్తానికి దర్శన్ కి బెయిల్ వచ్చింది.. కానీ..?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.