March 27, 202510:50:36 PM

Nagarjuna: చిరంజీవి గురించి నాగార్జునకి అక్కినేని చెప్పిన మాటలు!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) డాన్సులకి ఇప్పటి జనరేషన్ ప్రేక్షకుల్లో కూడా అభిమానులు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ‘ఇప్పట్లో డాన్స్ చేసే హీరోలు లేరా?’ స్పీడ్ గా డాన్స్ చేసే హీరోలు బోలెడు మంది ఉన్నారు. కానీ గ్రేస్ తో కూడిన డాన్స్ అందులోనూ.. తన డాన్స్ చూస్తున్న ప్రేక్షకులతో కూడా స్టెప్పులు వేయించాలి అనే కుతూహలం కలిపించే హీరో ఒక్క చిరంజీవి మాత్రమే ఉన్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి స్టార్ గా ఎదగడానికి ఆయన డాన్స్ చాలా ఉపయోగపడింది.

Nagarjuna

కోట్లల్లో ఫ్యాన్స్ ని కూడా తెచ్చిపెట్టింది. చిరంజీవిలా డాన్స్ చేయడం అనేది అందరికీ ఒక కల అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఇక విషయం ఏంటంటే ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) నేషనల్ అవార్డుకి చిరంజీవి ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ వేడుక ఈరోజు హైదరాబాద్లో ఘనంగా జరిగింది. దీనికి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), టి.సుబ్బిరామిరెడ్డి (T. Subbarami Reddy) వంటి పెద్దలు హాజరయ్యారు.

ఈ క్రమంలో నాగార్జున (Nagarjuna)  మాట్లాడుతూ.. ‘నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న టైంలో.. అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవి గారి సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు మా నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) ‘సినిమాల్లోకి వస్తున్నావు కదా.. అక్కడ చిరంజీవి సినిమాకి సంబంధించి సాంగ్ షూటింగ్ జరుగుతుంది. వెళ్లి డాన్స్ ఎలా వేయాలో నేర్చుకో’ అని చెప్పారు.

అప్పుడు నేను సెట్ కి వెళ్లి చూశాను. హీరోయిన్ రాధతో కలిసి చిరంజీవి డాన్స్ చేస్తున్నారు. నాకు భయమేసింది. నేను ఇలాంటి డాన్స్ వేయలేను అని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు కూడా ‘నువ్వు డాన్స్ చేస్తుంటే నేను హీరోయిన్స్ ని చూడను’ అని చెప్పినట్టు చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

వజ్రోత్సవాల్లో నేను అందుకే అవార్డు తీసుకోలేదు…ఇప్పుడు నేను గెలిచాను : చిరంజీవి

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.