March 20, 202506:59:45 AM

నా అల్లుడు సినిమా గురించి పెద్ద సీక్రెట్ బయటపెట్టిన శ్రేయ!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా తెరకెక్కిన “నరసింహుడు” (Narasimhudu) సినిమా ప్రొడ్యూసర్ చెంగల వెంకట్రావు సినిమా విడుదలైన తర్వాత డిజాస్టర్ టాక్ కారణంగా కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు చెల్లించలేక హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్త ఓ సెన్సేషన్. అయితే.. సుసైడ్ కు ప్రయత్నించడానికి కారణం సినిమా వల్ల వచ్చిన నష్టాలు కాదని, ఫ్యామిలీ ఇష్యూస్ అని మరో వెర్షన్ వినిపించింది కానీ..

Jr NTR

ఇప్పటికే అందరూ నమ్మేది సినిమాకు వచ్చిన భారీ నష్టాల వల్లే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని. అయితే.. ఇన్నాళ్ల తర్వాత శ్రేయ (Shriya Saran) తన బాలీవుడ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను జెనిలియా కలిసి తారక్ తో నటించిన సినిమా ప్రొడ్యూసర్ చాలా ఖర్చు పెట్టాడు. షూటింగ్ కంప్లీట్ అయ్యి, ఆర్టిస్టుల మరియు టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ క్లియర్ చేయడానికి డబ్బులు లేక ఆఖరి రోజు ఓ కొలనులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

అతనితో వెళ్లిన వాళ్లు అతడ్ని కాపాడి తీసుకొచ్చారు. ఆ తర్వాత నేను నా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు” అని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్, శ్రేయ, జెనీలియా (Genelia) కలిసి నటించిన ఏకైక సినిమా “నా అల్లుడు” (Naa Alludu). ఈ సినిమా కూడా 2005లోనే “నరసింహుడు” కంటే సరిగ్గా నాలుగు నెలల ముందు విడుదలవ్వడం గమనార్హం. సినిమాలు తీసి నిర్మాతలు ఘోరంగా నష్టపోవడం చూసే ఉంటాం.

కానీ ఒకే హీరో కారణంగా ఇద్దరు నిర్మాతలు ఆత్మహత్య ప్రయత్నం చేయడం మాత్రం ఇదే మొదటిసారి అనుకుంటా. అయితే.. ఈ విషయాన్ని వెళ్లగక్కినందుకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ శ్రేయ మీద మండిపడుతున్నారు. ఆమె ఎలాగూ అవన్నీ పట్టించుకోదు అనుకోండి.

‘కల్కి 2898 ad’ గురించి అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ కామెంట్స్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.