March 27, 202510:32:39 PM

Pawan Kalyan: ఆ సీనియర్‌.. జూనియర్‌ సూపర్‌.. తమిళ దర్శకులపై పవన్‌ ప్రశంసలు!

ఏదైనా సినిమా విజయం సాధిస్తే.. ఆ వ్యక్తులు తనకు, తన మనసుకు దగ్గర వాళ్లు అయితే వారిని అభినందిచడం పవన్‌ కల్యాణ్‌కు (Pawan Kalyan)  అలవాటు. అలా కొన్ని సినిమాలకు, టీమ్‌లకు ఆయన అభినందనలు వెళ్లాయి. అయితే ఆయన ఏదైనా ఇంటర్వ్యూలో ఇతర సినిమా జనాలను పొగడం అరుదు. అసలు ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడమే అరుదు. అలాంటి పవన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ దర్శకులను, నటులను పొగిడేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి,.

Pawan Kalyan

రాజకీయాలు ఒకవైపు.. మరోవైపు చిన్నగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు పవన్‌ కల్యాణ్. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమల వెళ్లారు. అయితే ఇటీవల ఆయన ఓ తమిళ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కోలీవుడ్‌లో తనకు నచ్చిన దర్శకుడు, కమెడియన్‌ గురించి మాట్లాడారు. కమెడియన్‌ యోగిబాబు (Yogi Babu) అంటే ఇష్టమని చెప్పిన పవన్‌.. ఇటీవల ఆయన నటించిన ఓ సినిమా చూశానని చెప్పారు.

ఆ సినిమాలో సర్పంచిగా యోగి నటన బాగుందని, సినిమా చూసినంతసేపు బాగా నవ్వుకున్నాను అని కూడా చెప్పారు పవన్‌. మరి దర్శకుల సంగతి అని అడిగితే.. మణిరత్నం సినిమాలంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. యువతరం దర్శకుల్లో అయితే లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఫిల్మ్‌ మేకింగ్ నచ్చిందని తెలిపారు. ఆయన దర్శకత్వ వహించిన ‘లియో’ (LEO) , ‘విక్రమ్‌’ (Vikram) సినిమాలు చూశానని, బాగున్నాయని చెప్పుకొచ్చారు పవన్‌.

పవన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్‌ – లోకేశ్‌ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చి.. అందులో యోగిబాబు కామెడీ ఉంటే అదిరిపోతుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌ కొత్త సినిమాను ఓకే చేయడం, దానిని పూర్తి చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే పవన్‌ మూడు సినిమాలు పూర్తిచేయాల్సి ఉంది. ‘ఓజీ ’ (OG Movie), ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) , ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)సెట్స్‌పై ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ‘హరి హర..’ సినిమా షూటింగ్‌ను రీస్టార్ట్‌ చేశారు.

‘అన్‌స్టాపబుల్‌ 3’ వచ్చేస్తోంది.. టీమ్‌ ప్లానింగ్‌ ఇదేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.