March 23, 202505:44:34 AM

Samantha: ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

Samantha

నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, హీరోయిన్ సమంత (Samantha) మరియు అక్కినేని కుటుంబం గురించి తీవ్రమైన వ్యాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ విషయమై వెంటనే నాగార్జున (Nagarjuna) స్పందిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం అమల అక్కినేని, అఖిల్ అక్కినేని, నాగచైతన్య అక్కినేని (Naga Chaitanya) కూడా సదరు వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Samantha

అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా.. జూనియర్ ఎన్టీఆర్ & నాని కూడా ఈ విషయమై ఘాటుగా స్పందించారు. సినిమా ఇండస్ట్రీపై ఈ విధంగా హేయమైన వ్యాఖలు చేస్తే ఊరుకునేది లేదని వారు కాస్త గట్టిగానే చెప్పారు. స్టార్ హీరోలైన ఎన్టీఆర్ & నాని ఈ విధంగా తమ ఇండస్ట్రీలోని ఒక హీరోయిన్ పై చేసిన వ్యాఖలపై సీరియస్ అవ్వడం, వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరడం అనేది హర్షణీయం.

అయితే.. ఇదే సపోర్ట్ గతంలో పవన్ కళ్యాణ్ తల్లిని ఓ బీగ్రేడ్ ఆర్టిస్ట్ నీచంగా తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ పిల్లల్ని పోసాని లాంటి ఓ సీనియర్ రైటర్ కమ్ యాక్టర్ అనరాని మాటలు అన్నప్పుడు ఇదే ఇండస్ట్రీ నుండి ఎవరూ ఎందుకు స్పందించలేదు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ ఐకమత్యం అప్పుడే చూపించి ఉంటే.. అసలు సినిమావాళ్లను చీప్ గా చూడడం అనేది ఎప్పుడో ఆగిపోయేదని, అప్పట్లో జగన్ కి భయపడి ఎవరు ముందుకు రాకపోవడం అనేది బాధాకరమని ట్వీట్స్ వేస్తున్నారు.

ఇకపోతే.. ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీలోని ఆడవారి మీద పొలిటికల్ మరియు న్యూస్ ఛానల్స్ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఓ న్యూస్ ఛానల్ యాంకర్ ఏకంగా “మీ ఇండస్ట్రీలో ల** ము** లేరా” అని చేసిన కామెంట్ కి ఫిలిం ఛాంబర్ కాస్త గట్టిగానే స్పందించింది. కానీ.. ఇలా సెలక్టెడ్ గా స్పందించడం అనేది మంచిది కాదు, ఎవరి ఇంట్లో ఆడవాళ్లైనా ఆడవాళ్లే అనే విషయాన్ని ఇకనైనా ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు గుర్తించి.. కాస్తంత ఐకమత్యం చూపించగలిగితే.. ఈ తరహా నీచమైన కామెంట్లు చేసేప్పుడు రాజకీయనాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారు. ఎందుకంటే.. ఒక్క స్టార్ హీరో ట్వీట్ చాలు సదరు నాయకుల పునాదులు కదలడానికి.

ఇకపోతే.. ఈ విషయమై కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి అని వస్తున్న ఒత్తిడికి తలొగ్గి ఆమె మీడియా సాక్షిగా సమంతకు (Samantha) సారీ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరి సినిమా ఇండస్ట్రీ నుండి అత్యధిక పన్ను వసూలు చేసే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పెద్ద అయిన రేవంత్ రెడ్డి ఈ విషయమై ఇప్పటివరకు స్పందించలేదు. కొండా సురేఖ వ్యాఖ్యల విషయంలో ఆమెపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.