March 24, 202501:23:05 AM

Sathyam Sundaram Collections: ‘సత్యం సుందరం’ 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy)  కాంబినేషన్లో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హ‌గ‌న్‌) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు చేసిన సి ప్రేమ్ కుమార్  (C. Prem Kumar) ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్’ సంస్థ విడుదల చేసింది.

మొదటి రోజు ఈ సినిమా తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ‘దేవర’ పోటీగా ఉండటంతో.. కలెక్షన్స్ పర్వాలేదు అనే విధంగానే వచ్చాయి. అయితే 2వ వారం కూడా ఈ మూవీ స్టడీగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి (Sathyam Sundaram) 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.68 cr
సీడెడ్ 0.69 cr
ఉత్తరాంధ్ర 0.83 cr
ఈస్ట్+వెస్ట్ 0.43 cr
కృష్ణా + గుంటూరు 0.61 cr
నెల్లూరు 0.26 cr
ఏపి+ తెలంగాణ 4.50 cr

‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) చిత్రానికి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజుల్లో ఈ చిత్రం రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం ఇంకా రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దసరా హాలిడేస్ ఉన్నప్పటికీ పోటీగా చాలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. ‘సత్యం సుందరం’ పోటీలో బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది అనుమానంగానే ఉంది.

వేట్టయన్ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.