March 20, 202512:28:59 PM

Sobhita: ఆ సినిమా ఫొటో షేర్‌ చేసి అవెంజర్స్‌ అంటున్న శోభిత.. తన పిల్లలకు..!

విక్రమ్‌ (Vikram) , కార్తి (Karthi), జయం రవి (Jayam Ravi), ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai Bachchan), త్రిష (Trisha), ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi).. ఇండియన్‌ సినిమా గర్వించదగ్గ కాస్ట్‌ అండ్‌ క్రూ వీళ్లు. వీళ్ల గురించి ఎంత చెప్పినా, ఎంత రాసినా తక్కువే. అందుకేనేమో ఏకంగా వీరిని అవెంజర్స్‌తో పోల్చింది శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala). వీళ్లంతా కలసి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సంద్భంగా ప్రచారంలో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

Sobhita

మ‌ణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్‌’ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శోభితా ధూళిపాళ నాటి రోజులను గుర్తుచేసుకుంది. ఈ క్రమంలో టీమ్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘వీళ్లందరూ అవెంజర్స్‌ అని నా పిల్లలకు చెబుతాను’ అని క్యాప్షన్‌ పెట్టింది. అంటే సూపర్‌ హీరోస్‌ అని ఆమె ఉద్దేశం. నిజానికి ఆ సినిమా కోసం వాళ్లు అలానే కష్టపడ్డారు కూడా. అందుకే శోభిత అలా చెప్పింది.

ఇక త‌మిళ‌నాట అత్యంత పాఠ‌కాద‌ర‌ణ పొందిన ‘పొన్నియిన్ సెల్వన్‌’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. క‌ల్కి కృష్ణమూర్తి ర‌చించిన ఈ న‌వ‌ల ఆధారంగా తెరకెక్కిన రెండు సినిమాలు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నాయి. ఇటీవల ఐఫా వేడుకలోనూ అవార్డులు అందుకుంది చిత్రబృందం. ఉత్తమ నటుడిగా విక్రమ్‌ పురస్కారం అందుకోగా.. క్రిటిక్స్‌ ఛాయిస్‌లో ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్‌ నిలిచింది.

ఇక శోభిత విషయం చూస్తే.. ఇటీవల ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగచైతన్యతో (Naga Chaitanya)   ఆమె నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహం అని చెబుతున్నారు. అయితే ఎప్పుడు, ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే.. ‘లవ్‌ సితార’ అనే సినిమా ఇటీవల జీ5 ద్వారా విడుదలైంది. అది తప్ప కొత్త సినిమాలేవీ ఆమె ఓకే చేయలేదు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో దీపిక పడుకొణెకు (Deepika Padukone) తెలుగు డబ్బింగ్‌ చెప్పింది.

ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.