March 22, 202501:25:31 AM

‘అన్‌స్టాపబుల్‌ 3’ వచ్చేస్తోంది.. టీమ్‌ ప్లానింగ్‌ ఇదేనా?

ప్రపంచానికి కొత్త నందమూరి బాలకృష్ణను (Nandamuri Balakrishna)  చూపించిన కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌’. భోళా బాలయ్య అంటూ ఆయనకు ఇండస్ట్రీలో పేరున్నా.. అభిమానుల ముందు, ప్రేక్షకుల ముందు ఆయన అలా ఎప్పుడూ కనిపించలేదు. సరదాగా ఆయన మాట్లాడటం, కుర్ర హీరోలతో కలసిపోయి అల్లరి చేయడం చూసి ఆశ్చర్యపోయారు. అందుకే 2+1 సీజన్‌లు ఆ కార్యక్రమం రాగా.. అన్నింటినీ హిట్‌ చేశారు. తాజాగా కొత్త సీజన్‌కు రంగం సిద్ధమ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు రావొచ్చు అనే చర్చ కూడా మొదలైంది.

Unstoppable with NBK 3

‘అన్‌స్టాపబుల్‌ 3’ (Unstoppable with NBK 3 ) వస్తుంది అని కొద్ది రోజుల క్రితమే అనౌన్స్‌ చేశారు. అయితే ఎప్పుడు అనేది చెప్పలేదు. అయితే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా చివరి దశకు రావడంతో వెంటనే బాలయ్య హోస్ట్‌ కుర్చీ ఎక్కేస్తారు అనే చర్చ జరుగుతోంది. ‘అన్‌స్టాపబుల్ 3’ షూటింగ్‌ త్వరలో ఉంటుందని.. ఈ నెలలోనే తొలి ఎపిసోడ్‌ వస్తుందని కూడా చెబుతున్నారు. తొలి ఎపిసోడ్‌ను బాలయ్య సన్నిహిత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సినిమా టీమ్‌తోనే ఉంటుంది అని చెబుతున్నారు.

‘అన్‌స్టాపబుల్’ మూడో సీజన్‌ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో (Dulquer Salmaan) మొదలు అవుతుందట. దుల్కర్ నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమా అక్టోబరు నెలాఖరులో రిలీజ్‌కి ఉంది. దీంతో ఆ టీమ్‌ ప్రచారంలో భాగంగా ‘అన్‌స్టాపబుల్‌’కి వస్తారు అని అంటున్నారు. దానికితోడు దుల్కర్‌ గురించి కొత్త విషయాలు తెలిస్తే బాగుండు అని మన ఫ్యాన్స్‌ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన అందరి హీరో ఇప్పుడు.

ఇక ఆఖరి ఎపిసోడ్‌ను స్టార్‌ హీరోతో ముగించడం ‘అన్‌స్టాపబుల్‌’కి అలవాటు. అలా ఈసారి సంక్రాంతి స్పెషల్‌గా చిరంజీవితో (Chiranjeevi) ముగిస్తారు అని అంచనా వేస్తున్నారు. ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా ప్రచారం.. బాలయ్యతో ఉన్న సుదీర్ఘ పరిచయం మూలానా చిరు కూడా ఆ కార్యక్రమానికి రావడానికి ఆసక్తిగా ఉన్నారు అని చెబుతున్నారు. మధ్యలో రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా వస్తారు అనే టాక్‌ నడుస్తోంది.

ఆ సినిమా ఫొటో షేర్‌ చేసి అవెంజర్స్‌ అంటున్న శోభిత.. తన పిల్లలకు..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.