
దివంగత నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఏడాది అంటే 2023 ఫిబ్రవరి 18న మరణించారు. నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కోమాలోకి వెళ్ళిపోయి.. 23 రోజుల పాటు మరణంతో పోరాడి ఓడిపోయారు. నిండా 40 ఏళ్ళు కూడా లేని తారకరత్న మరణించడంతో ఆ టైంలో నందమూరి, నారా ఫ్యామిలీస్ ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ అయ్యాయి.
Taraka Ratna
ఇక తారకరత్న ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అతని భార్య పేరు అలేఖ్య రెడ్డి. వీరిది ప్రేమ వివాహం. వీరి వివాహానికి నందమూరి ఇంటి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో తారకరత్న దంపతులు చాలా కాలం పాటు కుటుంబానికి దూరమయ్యారు. తర్వాత బాలయ్య చొరవతో తారకరత్న కుటుంబాన్ని చేరదీయడం జరిగింది. ఇక తారకరత్న దంపతులకు ముగ్గురు పిల్లలు. ఒక కూతురు, ఇద్దరు కుమారులు. కూతురు పేరు నిష్క. తాజాగా ఆమె హాఫ్ శారీ వేడుక జరిగింది.
కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకని అలేఖ్య రెడ్డి నిర్వహించినట్లు తెలుస్తోంది. నిష్క తన తండ్రి ఫోటోకి దణ్ణం పెడుతూ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు, అలాగే తన ఇద్దరి తమ్ముళ్ళతో, తల్లితో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ‘తమ బెస్ట్ విషెస్, బ్లెస్సింగ్స్ తెలుపుతూనే.. ‘తారకరత్న బ్రతికుండి ఉంటే ఈ వేడుక ఇంకా ఘనంగా జరిగుండేది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram