March 18, 202502:39:22 PM

Trivikram: శ్రీనాథ్ మాగంటి నటనకు ఫిదా అయిపోయిన త్రివిక్రమ్!

శ్రీనాథ్ మాగంటి (Srinath Maganti) ‘హిట్’ (HIT: The First Case) ‘హిట్ 2’ (HIT: The First Case) సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. గత ఏడాది వచ్చిన రణబీర్ కపూర్ (Ranbir Kapoor) – దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)..ల ‘యానిమల్’ (Animal) లో కూడా కార్తీక్ అనే రోల్లో నటించాడు. త్వరలో రాబోతున్న.. అంటే అక్టోబర్ 31 న విడుదల కాబోతున్న ‘లక్కీ భాస్కర్’  (Lucky Baskhar) లో కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు.ఇతని నటన గురించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  (Trivikram) చాలా గొప్పగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Trivikram

అవును ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జె.ఆర్.సి కన్వెన్షన్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda) గెస్ట్..లు గా వచ్చారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అతనికి హోమ్ బ్యానర్ వంటిది కాబట్టి.. త్రివిక్రమ్ ముందుగానే ఈ చిత్రాన్ని చూసేసాడట.సినిమాపై త్రివిక్రమ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పెర్ఫార్మన్స్ తో పాటు ఇంకొంతమంది నటీనటుల గురించి అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

ఈ క్రమంలో శ్రీనాథ్ మాగంటిని చూసి.. ‘మీరు ఇక్కడ ఉన్నారని చెప్పడం కాదు. నాకు మీ పేరు తెలీదు బ్రదర్.. ఐ యాం సారీ. కానీ చాలా చాలా బాగా చేశారు మీరు. మనీ అనే ఒక ఎడిక్షన్లో పడిపోయిన తర్వాత మనుషులు హార్ట్ లేకుండా హార్డ్ గా ఎలా అయిపోతారు అనేదాన్ని ఆ హాస్పిటల్ సీన్లో చాలా బాగా చేశావు’ అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ప్రశంసించారు. అంత పెద్ద దర్శకుడు గుర్తుపెట్టుకుని మరీ అప్ కమింగ్ యాక్టర్ ని అభినందించడం అంటే విశేషంగానే చెప్పుకోవాలి.

అయాన్.. నా గొడ్డలి ఎందుకు తీసుకెళ్లావ్ రా అంటూ అల్లు అర్జున్ ఫన్నీ ఇన్స్టా స్టోరీ!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.