March 23, 202508:57:11 AM

Viswam Collections: ‘విశ్వం’ 11 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

గోపీచంద్(Gopichand) , కావ్య థాపర్ (Kavya Thapar) హీరో హీరోయిన్లుగా… శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’ (Viswam) . దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలైంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ‘చిత్రాలయం స్టూడియోస్’ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలిరోజు ‘విశ్వం’కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫామ్లో లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ నిరాశపరిచాయి. వీక్ డేస్ లో స్టడీగా రాణిస్తుంది కానీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవ్వడం అనేది కష్టంగానే ఉంది అని చెప్పాలి.

Viswam Collections:

ఒకసారి (Viswam) 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 2.38 cr
సీడెడ్ 0.73 cr
ఉత్తరాంధ్ర 0.88 cr
ఈస్ట్ 0.33 cr
వెస్ట్ 0.23 cr
గుంటూరు 0.60 cr
కృష్ణా 0.71 cr
నెల్లూరు 0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.11 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.46 cr
ఓవర్సీస్ 0.38 cr
వరల్డ్ వైడ్ టోటల్ 6.95 cr

‘విశ్వం’ చిత్రానికి రూ.12.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.95 కోట్ల షేర్ ను రాబట్టింది. ఉన్నంతలో ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.6.05 కోట్ల షేర్ ను రాబట్టాలి. టార్గెట్ రీచ్ అవ్వడం అయితే కష్టమే కానీ.. ఉన్నంతలో ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.

అనిల్ రావిపూడి రిక్వెస్ట్… దిల్ రాజు కరుణిస్తాడా..?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.