March 20, 202511:05:53 PM

Aditi Shankar: తెలుగు సినిమాలో శంకర్ కూతురి లుక్ చూశారా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్  (Bellamkonda Sai Sreenivas)  హీరోగా ‘భైరవం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నారా రోహిత్ (Nara Rohit) మరో హీరోగా నటిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) విలన్ గా నటిస్తున్నాడు. ‘నాంది’ ‘ఉగ్రం’ (Ugram) వంటి సినిమాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల (Vijay Kanakamedala)  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. కె.కె.రాధామోహన్ (K. K. Radhamohan) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పెన్ స్టూడియోస్’ అధినేత జయంతి లాల్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Aditi Shankar

ఈ ప్రాజెక్టుకి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. దర్శకుడు శంకర్ (Shankar) కూతురు అదితి (Aditi Shankar) టాలీవుడ్ డెబ్యూ ఇస్తుండటం. అవును ఈ సినిమాలో ఆమె హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జోడీగా నటిస్తోంది. తాజాగా ఆమె (Aditi Shankar) పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘భైరవం’ లో వెన్నెల అనే అల్లరి పిల్ల పాత్రలో ఆమె కనిపించనుందట. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ను గమనిస్తే.. ఇందులో ఆమె పల్లెటూరిలో పాలు అమ్ముకునే అమ్మాయిగా కనిపిస్తుంది.

ఆమె లుక్ ను గమనిస్తే.. చాలా సన్నగా ఉంది. అలాగే హాఫ్ శారీ కట్టుకొని.. రెండు జడలతో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె లుక్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. నటన పరంగా కూడా ఈ సినిమాతో ఆకట్టుకుంటే కనుక తెలుగులో ఈమెకు మరిన్ని ఆఫర్లు వరిస్తాయి. గతంలో ఈమె తమిళంలో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) నటించిన ‘మహావీరుడు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shankar (@aditishankarofficial)

ఆర్జీవీ.. అతని శిష్యులతో చిరంజీవి సినిమా అంటే ఆగిపోవడమే.. లిస్ట్‌ చూస్తే మీరూ..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.