March 18, 202503:01:46 AM

Akhil Akkineni: హిట్టు కోసం మళ్ళీ అదే బాటలో అఖిల్!

Akhil Akkineni Following Same Route to Get HIT

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni)  కెరీర్ పరంగా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. మొదటి సినిమా అఖిల్ భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అవ్వగా, రెండో చిత్రం హలో మంచి ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను (Mr. Majnu) యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక నాలుగో సినిమాగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor)  మాత్రం అఖిల్ కి మొదటి కమర్షియల్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది.

Akhil Akkineni

కానీ అఖిల్ ఈ విజయాన్ని కొనసాగించలేకపోయాడు. సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో చేసిన ఏజెంట్ (Agent) భారీ అంచనాల మధ్య విడుదలై, అఖిల్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీని తర్వాత గ్యాప్ తీసుకుని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడని టాక్ వచ్చింది. అయితే, ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే, అఖిల్ ఇప్పుడు తన హోమ్ బ్యానర్ లో మళ్లీ ఒక సినిమా చేయబోతున్నాడు.

ఈ చిత్రం వినరో భాగ్యము విష్ణు  (Vinaro Bhagyamu Vishnu Katha)  కథతో ఫేమ్ సంపాదించిన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో తెరకెక్కనుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. రెగ్యులర్ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ లేకుండా, సరికొత్త పాయింట్ తో కథను చెప్పేందుకు దర్శకుడు ప్లాన్ చేశారని తెలుస్తోంది. అఖిల్ ఈ సారి యాక్షన్ జోనర్ ని కాస్త పక్కన పెట్టి, ప్రేమకథ వైపుగా అడుగులు వేస్తున్నాడు.

ఏజెంట్ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం బాగా కష్టపడినా, ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో అఖిల్ మరోసారి ప్రేమకథల వైపుకు మళ్లాడు. ఈ చిత్రం తర్వాత యూవీ క్రియేషన్స్ లో యాక్షన్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, ఈ సారి ప్రేమకథతో అఖిల్ మంచి సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి అఖిల్ ఈ సారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. మరో స్టార్ కోసం వేట!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.