March 27, 202510:32:20 PM

Karuna Kumar: ‘మట్కా’ కథ అలా పుట్టింది : దర్శకుడు కరుణ కుమార్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా ‘మట్కా’ (Matka) సినిమా రూపొందింది. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. ‘పలాస’ వంటి మంచి చిత్రాన్ని అందించాడనే ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్  (Karuna Kumar) దీనికి దర్శకుడు. ‘మట్కా’ టీజర్ కానీ, ట్రైలర్, పాటలు అన్నీ చాలా మాస్ గా ఉన్నాయి. హీరో వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో అతను 4 రకాల లుక్స్ లో కనిపించబోతున్నాడు. వీటి కోసం చాలా హార్డ్ వర్క్ వర్క్ చేశాడు.

Karuna Kumar

పారలల్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ.. ‘మట్కా’ కోసం అతను చేసిన హార్డ్ వర్క్ అంతా ఇంతా కాదు. ఇక సెట్స్ లో ఉన్నప్పుడు కూడా బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమా పలుమార్లు ఆగింది. ఇలాంటి ఒడుదుడుకులు ఎన్నో తట్టుకుని ఈ సినిమాని కంప్లీట్ చేశారు మేకర్స్. ఇదిలా ఉండగా.. దర్శకుడు కరుణ కుమార్ ‘మట్కా’ కథని సినిమాగా తీయాలని అనుకోలేదట.

ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పుకొచ్చాడు.’ఓ పెళ్లి వేడుకలో వైజాగ్ లో ఉండే నైట్ క్లబ్బులు, క్యాబరీలు,మట్కా.. వంటి వాటి గురించి నేను విన్నాను. వాటిని ప్రధానంగా చేసుకుని ‘వాడిపోయిన పువ్వులు’ అనే పేరుతో ఒక షార్ట్ స్టోరీ రాద్దామని మొదలుపెట్టాను. కానీ అలా రాస్తున్నప్పుడు షార్ట్ స్టోరీగా కంటే సినిమాగా బాగుంటుంది అనిపించింది.

ఈ కథకి న్యాయం చేయగల హీరో వరుణ్ తేజ్ అని ఫిక్స్ అయ్యాను. అలా దీనిని ‘మట్కా’ గా తీశాను’ అంటూ ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి..!

బాలయ్య, రాంచరణ్ సినిమాలు ఉన్న వెంకీ సినిమాకి అంత డిమాండా..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.