
అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) మలయాళం ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు కొచ్చి(కేరళ) లో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ” మలయాళం ప్రేక్షకులకు నమస్కారం. మీరు నన్ను అడాప్ట్ చేసుకున్న విధానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ మాత్రం వీరాభిమానులు ఉన్నారు అని చెప్పుకుంటాను.
Allu Arjun
‘పుష్ప’ లో ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ని తెలుగులో ఎక్కువగా చెప్పేది మీరే. మలయాళం వెర్షన్ ఉన్నప్పటికీ ఆ డైలాగ్ ను మీరు తెలుగులోనే చెబుతారు.నాపై మీకు ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క విషయంతో చెప్పవచ్చు. 3 ఏళ్ళ పాటు ‘పుష్ప 2’ కోసం మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని నాకు తెలుసు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. తప్పకుండా మీ అందరికీ నచ్చాలనే ఉద్దేశంతో ఎక్కువ టైం తీసుకుని కష్టపడ్డాం.
ఇక నుండి వరుసగా సినిమాలు చేస్తాను. మా డైరెక్టర్ సుకుమార్ ఇక్కడ లేరు. నాకు ‘ఆర్య’ సినిమాతో మలయాళంలో మార్కెట్ ఏర్పడింది. ఆ సినిమాకు దర్శకుడు అతనే..! ఇక ఫహాద్ ఫాజిల్ మై బ్రదర్. ఈరోజు అతనితో కలిసి స్టేజిపై ఉండాలనుకున్నాను. కానీ కుదరలేదు. కానీ ఒక్క విషయం కచ్చితంగా చెప్పగలను. ‘పుష్ప 2’ లో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) నటన నిజంగా రాకింగ్ అంతే..! మీరంతా ప్రౌడ్ గా ఫీలయ్యేలా అతను నటించాడు. రసూల్ పూకుట్టి సార్ కూడా మా సినిమాకి బెస్ట్ ఇచ్చారు.
మలయాళ ప్రేక్షకులు అనేసరికి నాకు ఓ కొత్త ఉత్సాహం వస్తుంది. మీ కోసం ఏదో ఒకటి చేయాలని నాకు మొదటి నుండి ఉంది. నా స్నేహితుడు దేవి శ్రీ ప్రసాద్ కి(Devi Sri Prasad) ఈ విషయం చెబితే.. మీ అందరి కోసం మలయాళం సాంగ్ చేసి పెట్టాడు. ఆ పాటలో రెండు, మూడు లైన్స్ బాగా ఇంప్రెస్ చేస్తాయి. ఈ పాట కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇక ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 6 భాషల్లో 11000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.
‘పుష్ప 2’ మలయాళం అభిమానులకి అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్!#AlluArjun #MalluArjun #Pushpa2TheRule #PushpaRulesKeralam pic.twitter.com/sXtDNOGhWk
— Filmy Focus (@FilmyFocus) November 27, 2024