
అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2: ది రూల్ (Pushpa 2)చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. కానీ ఈ విడుదలకు ముందు సోషల్ మీడియాలో కొత్తగా చర్చకు దారితీసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ మరియు పుష్ప 2 టీంకు ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు.
Allu Arjun
ఈ పోస్ట్‌లో పుష్పరాజ్ ఇమేజ్‌తో ఉన్న లేస్, అగరబత్తి, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్న పోస్ట్ ను షేర్ చేస్తూ, “వైల్డ్ ఫైర్ స్క్రీన్ మీద చూసేందుకు ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానుల్లో భిన్నమైన రియాక్షన్లు మొదలయ్యాయి. 2024 ఎన్నికల సమయంలో శిల్పారవికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఒక వర్గం జనసేన, టీడీపీ అభిమానులు పుష్ప 2ని బహిష్కరించాలనే ట్రెండ్‌కి ప్రోత్సహించారు.
ఇప్పుడు శిల్పారవి మళ్ళీ అలాంటి పోస్ట్ పెట్టడం, దానికి బన్నీ “థాంక్యూ బ్రదర్” అంటూ పాజిటివ్‌గా స్పందించడం మరోసారి పాత గాయాలను గుర్తు చేసింది. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ఇలా రాజకీయాలకు దూరంగా ఉండడం చాలా బెటర్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పుష్ప 2 బాక్సాఫీస్ రిజల్ట్‌పై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం తన సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టగా, ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల మూవీ ప్రమోషన్స్ దారితప్పే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బన్నీ వీటిని పెద్దగా పట్టించుకోకుండా, “ప్రేమకు ధన్యవాదాలు” అంటూ కూల్‌గా స్పందించడం ఆ టాపిక్‌ను కాస్త తగ్గించిందని విశ్లేషిస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి వివాదాల ప్రస్తావన అనవసరంగా ఇంపాక్ట్ కలిగించవచ్చని భావిస్తున్నప్పటికీ, పుష్ప 2 భారీ అంచనాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఈ అంశం సినిమా కలెక్షన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Loads of love and best wishes .. can’t wait to watch the wild fire on screen @alluarjun #Pushpa2TheRule pic.twitter.com/FBkfGazfut
— Silpa Ravi Reddy (@SilpaRaviReddy) November 20, 2024