March 18, 202502:38:54 PM

హీరోయిన్ల కాళ్ళ వద్ద స్టార్ హీరోలు..కొత్త ట్రెండా..?

సినిమాల్లో హీరోయిన్లు (Heroine) గ్లామర్ కి, పాటలకి మాత్రమే పరిమితం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్లకు కూడా హీరోతో సమానమైన పాత్రలు లభిస్తున్నాయి. అవి కథలో కీలకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్స్ స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ రాస్తుండటం విశేషంగానే చెప్పుకోవాలి. గతంలో అంటే ‘1 నేనొక్కడినే’ (1: Nenokkadine) సినిమా టైంలో మహేష్ బాబు (Mahesh Babu)  సముద్రంలో నడుచుకుంటూ వెళ్తుంటే.. ఆ అడుగుల్లో చేతులు వేసుకుంటూ హీరోయిన్ పాకుతున్నట్టు ఓ పోస్టర్ ఉంటుంది.

Heroine

దానిపై స్టార్ హీరోయిన్ సమంత (Samantha) చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అందుకే దర్శకుడు సుకుమార్ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) లో రష్మిక (Rashmika Mandanna)  కాళ్ళతో అల్లు అర్జున్ (Allu Arjun) గడ్డం సవరదీసినట్టు ఓ విజువల్ ని ట్రైలర్ ద్వారా చూపించాడు. అంతేకాదు.. ‘శ్రీవల్లి నా పెళ్ళాం, పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో.. పెపంచకానికి చూపిస్తా’ అంటూ ఓ డైలాగ్ కూడా పెట్టి.. సినిమాలో హీరోయిన్ పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు.

అంతకు ముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  కూడా యానిమల్ సినిమాలో రష్మిక కాళ్ళ దగ్గర హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కుక్కపిల్లలా పడి ఉన్నట్లు ఓ సీన్ పెట్టాడు. అది కూడా హీరోయిన్ పాత్ర స్థాయిని పెంచే విధంగానే ఉంది. ఇక తాజాగా దర్శకుడు శంకర్ (Shankar)  కూడా గ్లోబల్ స్టార్ అయినటువంటి రాంచరణ్..ని  (Ram Charan) హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) వద్ద పెట్టి రొమాన్స్ చేయించాడు. ఇందులో గ్లామర్ కనిపిస్తుంది..కానీ సినిమాలో కియారా పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

నిన్న రిలీజ్ అయినా ‘నానా హైరానా’ పాటలోని విజువల్ ఇది. చూస్తుంటే.. హీరోయిన్ (Heroine) కాళ్ళ వద్ద స్టార్ హీరోలని పెట్టడం అనే ట్రెండ్ ని స్టార్ డైరెక్టర్లంతా ఫాలో అయ్యేలా ఉన్నారు. కానీ ఇందుకు చరణ్, బన్నీ..ల్లా మిగిలిన స్టార్ హీరోలు తగ్గుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ‘నానా హైరానా’ సాంగ్ ఈ విధంగా వైరల్ అవుతూ ఉండటం ఇంకో విశేషంగా చెప్పుకోవాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.