March 22, 202503:48:10 AM

పెళ్లిపీటలెక్కబోతున్న హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్!

‘ఆరెంజ్’ (Orange) సినిమాలోని ‘రూబా రూబా’ సాంగ్ చాలా ఫేమస్. ఆ సినిమా వచ్చి 14 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఆ పాటకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజువల్ గా కూడా పాట చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే హీరోయిన్ షాజన్ పదమ్సీ (Shazahn Padamsee) ఎక్స్ప్రెషన్స్ ని కూడా అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమా తర్వాత ఆమె బిజీ అయిపోతుంది అనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. ఆ తర్వాత 2013 లో వచ్చిన ‘మసాలా’ (Masala) సినిమాలో ఈమె రామ్ కి జోడీగా కనిపించింది.

Shazahn Padamsee

ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల అనుకుంట.. తర్వాత టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఈమెను పట్టించుకోలేదు. అయితే చాలా కాలం తర్వాత ఈమె వార్తల్లో నిలిచింది. సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. షాజన్ పదమ్సీ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. కొన్నాళ్లుగా ఆశిష్ కనాకియ అనే వ్యక్తితో ఈమె డేటింగ్లో ఉంది. త్వరలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఈ జంట భావిస్తోంది.

ఆశిష్ కనాకియ ఓ బిజినెస్మెన్ అని తెలుస్తుంది. ఇరు కుటుంబ సభ్యులు వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో వారి సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలుస్తుంది. 2025 ఆరంభంలో వీరి పెళ్ళి జరుగుతున్నట్టు సమాచారం. ఇక వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. కాబోయే దంపతులకి ‘ఆల్ ది బెస్ట్’ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee)

నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ దారుణంగా పడిపోయిన ‘కంగువా’ కలెక్షన్స్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.