March 23, 202508:41:16 AM

Matka Collections: ‘మట్కా’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

వరుణ్ తేజ్ (Varun Tej) లేటెస్ట్ మూవీ ‘మట్కా’ (Matka) నవంబర్ 14న రిలీజ్ అయ్యింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ (Meenakshi Chowdary)   గా నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్  (Karuna Kumar)  దర్శకుడు. నోరా ఫతేహి (Nora Fatehi) కూడా కీలక పాత్ర పోషించింది. ‘మట్కా’ టీజర్, ట్రైలర్లలో డైలాగులు ఇంప్రెస్ చేశాయి. దీంతో సినిమాలో ఏదో బలమైన విషయం ఉండి ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమా చాలా స్లోగా, ల్యాగ్ తో ఉందని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. దీంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.

Matka Collections:

మొదటి రోజు పెద్దగా ఆసక్తిగా లేని ఈ చిత్రం కలెక్షన్స్ రెండో రోజు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.25 cr
సీడెడ్ 0.09 cr
ఉత్తరాంధ్ర 0.16 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.04 cr
గుంటూరు 0.05 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.77 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.14 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.91 cr

‘మట్కా’ చిత్రానికి రూ.14.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో కేవలం రూ.0.91 కోట్ల షేర్ ను రాబట్టింది. అది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి తీయకుండా అని చెప్పాలి. వాటితో కలుపుకున్నా బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.14.09 కోట్ల షేర్ ను రాబట్టాలి. శని, ఆది వారాల్లో స్ట్రాంగ్ గా కలెక్ట్ చేస్తే.. మినిమమ్ రికవరీ అయినా ఉంటుంది. లేదు అంటే కష్టమే..!

తన భార్య గురించి తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.