March 22, 202503:38:49 AM

Dil Raju: ‘సెల్ఫిష్’ మళ్ళీ వార్తల్లోకి..దిల్ రాజు ఏమన్నాడంటే!

సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి  (Dil Raju) ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు అనే చెప్పాలి. ఆయన నిర్మాణంలో ఈ ఏడాది 3 సినిమాలు వచ్చాయి. అవే.. ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) ‘లవ్ మీ’ (Love Me) ‘జనక అయితే గనక'(Janaka Aithe Ganaka). ఇందులో ‘జనక అయితే గనక’ పర్వాలేదు అనిపించినా మిగిలిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రాలు విడుదల చేయబోతున్నారు. తర్వాత.. అంటే ఫిబ్రవరి నెలలో ‘తమ్ముడు’ (Thammudu) సినిమాని విడుదల చేయబోతున్నారు.

Dil Raju

అటు తర్వాత యష్ మాస్టర్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తారట. అనంతరం ‘సెల్ఫిష్’ (Selfish) ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయబోతున్నట్టు దిల్ రాజు తెలిపారు. వాస్తవానికి ‘సెల్ఫిష్’ మూవీ ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. దిల్ రాజు తన కొడుకు ఆశిష్ తో (Ashish Reddy) మొదలుపెట్టిన రెండో మూవీ ఇది. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. సుకుమార్ (Sukumar)  శిష్యుడు కాశి (Kasi Vishal) ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలి. కానీ సినిమా అనుకున్నట్టు రావడం లేదని పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది.

ఇక ఈ ప్రాజెక్టు ఉండదు అని అంతా అనుకుంటున్న వేళ దిల్ రాజు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘సుకుమార్ గారు ‘పుష్ప 2’  (Pushpa 2)  కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు ఈ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టమని చెప్పినట్టు’ దిల్ రాజు తెలిపారు. తర్వాత సుకుమార్ కేర్ తీసుకుని ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తారట. సో 2025 లో దిల్ రాజు బ్యానర్ నుండి 5 సినిమాలు వస్తున్నాయన్న మాట. మరి వచ్చే ఏడాది అయినా వరుసగా హిట్లు కొట్టి.. ఫామ్లోకి వస్తారేమో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.