March 22, 202505:34:31 AM

Harish Shankar: ‘మిస్టర్‌ బచ్చన్‌’..ఇప్పుడు ప్రొడ్యూసరే వరస్ట్ అన్నారు..రియాక్ట్‌ అవుతారా?

కొంతమంది హీరోలు, దర్శకులు ఉంటారండీ.. వాళ్ల సినిమా ఫలితాల మీద మాట్లాడితే వాళ్లకు అస్సలు నచ్చదు. ఎంత నిజాలు చెప్పినా.. తమ సినిమా చాలా బాగుంది అనేలా మాట్లాడతారు. ఒకవేళ అందరూ మెచ్చక థియేటర్లలో / స్క్రీన్లలో ఎత్తేసిన తర్వాత కూడా ‘ఫలితం తేడా కొట్టింది’ అని అంటే ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోదు. అయితే ఎవరి ప్రోడక్ట్ వారికి బాగా నచ్చుతుంది అని మనం వదిలేయడమే పరిష్కారం. పైన చెప్పిన పరిస్థితులు ప్రస్తుతం ఒక దర్శకునికి బాగా సెట్‌ అవుతాయి.

Harish Shankar

ఆయనే హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) . ఇటీవల ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) అంటూ రవితేజను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రీమేక్‌లు చేయడంలో అందె వేసిన చేయి అని పేరున్న ఆయనకు ఆ సినిమా చేయిచ్చింది. ఈ క్రమంలో ‘మిస్టర్ బచ్చన్’ ప్రాజెక్టు వెనక జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వాటి గురించి డిస్కషన్‌ నడుస్తున్న సమయంలో సినిమా ఫలితం గురించి నిర్మాతే స్పందించారు.

నిజానికి ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాపై ఇప్పటికే చాలా పోస్టుమార్టం జరిగింది. మరి ఆ పంచనామాలో ఏం తేలిందో తెలియదు కానీ.. ఇప్పుడు స్వయంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) మాట్లాడుతూ.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా తన జీవితంలో తీసుకున్న వరస్ట్ డెసిషన్ అనేశారు. నిర్మాతే ఈ మాట అన్నారు అంటే ఆ సినిమా ఫలితం విషయంలో ఇంకా ఎవరి నుండీ నో అనే మాట రాదు. ఆఖరికి దర్శకుడి నుండి కూడా అని చెప్పొచ్చు.

80ల నాటి హిందీ పాటలు నచ్చి సినిమా ఆడేస్తుందనుకున్నాను. సినిమా విషయంలో అదొక తప్పు అయితే, ఇంకో పెద్ద తప్పు కొన్ని సన్నివేశాలనును ఫాస్ట్‌గా తీసేయడం అని అంటున్నారు. సినిమాలోని ఆ ఎపిసోడ్స్‌ను కరెక్ట్‌గా తీసి ఉంటే సినిమా విజయం అందుకునేది అని నిర్మాత చెబుతున్నారు. అలాగే రైడ్ సీన్స్ ఎగ్జిక్యూట్ చేయడంలో పొరపాటుతో సినిమా మిస్ ఫైర్ అయిందని చెప్పారు. మరి ఈ విషయంలో దర్శకుడు హరీశ్‌ శంకర్ ఏమంటారో చూడాలి.

‘సెల్ఫిష్’ మళ్ళీ వార్తల్లోకి..దిల్ రాజు ఏమన్నాడంటే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.