March 22, 202508:33:22 AM

Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. మరో స్టార్ కోసం వేట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) చిత్రం సక్సెస్ తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా నిలిచారు. నెక్స్ట్ ‘వార్ 2’ లో హృతిక్ రోషన్ తో (Hrithik Roshan) స్క్రీన్ షేర్ చేసుకుంటూ తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడీ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో  (Prashanth Neel)  ఒక మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి.

Jr NTR, Prashanth Neel

మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా, మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందనుంది. ఈ చిత్రం కథాంశం ఒక రియల్ లైఫ్ మాఫియా డాన్ జీవితంలో కొన్ని ఘటనల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించారని టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో తారక్ కి జోడీగా నటించే హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) పేరు ప్రచారంలో ఉంది. ఇదే సమయంలో ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర కోసం మరో స్టార్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. సపోర్టింగ్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో పాటు, మరో స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్ లో చేరడం సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుందని భావిస్తున్నారు.

అది కూడా పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరో అని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే సినిమా పైన హైప్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్ ఫ్యాన్స్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. మరి తారక్ తో కలిసి నటించబోయే మరో స్టార్ ఎవరో, ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

వరుణ్ తేజ్ కి ఇది అసలైన యాసిడ్ టెస్ట్.. రెండ్రోజుల్లో అసలు జాతకం!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.