March 23, 202505:44:45 AM

Matka: వరుణ్ తేజ్ కి ఇది అసలైన యాసిడ్ టెస్ట్.. రెండ్రోజుల్లో అసలు జాతకం!

ఒక సినిమాకి హిట్, ఫట్ అనేది డిసైడ్ చేయడానికి కనీసం ఒకరోజు పడుతుంది. కానీ.. ఒక హీరో కెరీర్ డిసైడ్ చేసేది మాత్రం సదరు సినిమా మొదటి ఆట. ఫస్ట్ డే, ఫస్ట్ షోకి థియేటర్లు కనీసం 60% నిండకపోతే, సదరు హీరోకి స్టార్ డమ్ లేనట్లేనని ట్రేడ్ వర్గాలు డిసైడ్ చేసేస్తున్నాయి. ఇప్పుడు ఈ మేటర్ వరుణ్ తేజ్ కి పెద్ద యాసిడ్ టెస్ట్ గా మారింది. వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా తెరకెక్కిన “మట్కా” (Matka) చిత్రం నవంబర్ 14న విడుదలవుతుండగా..

Matka

ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అంచనాలను పెంచేలానే ఉంది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్పీచ్ కారణంగా సినిమా ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళింది. ఇంత జరిగింది కాబట్టి “మట్కా”కి కనీస స్థాయి ఓపెనింగ్స్ వస్తాయని టాక్ వినిపిస్తోంది. అలా జరిగితే గనుక కథానాయకుడిగా వరుణ్ తేజ్ సగం విజయం సాధించినట్లే. ఎందుకంటే.. వరుణ్ మునుపటి చిత్రాలైన “గని(Ghani) ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna)  ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) ” సినిమాలకు కనీస స్థాయి ఓపెనింగ్స్ రాలేదు.

సినిమాలు కూడా పెద్ద బాలేవు అనుకోండి. కానీ.. ఒక హీరోగా వరుణ్ స్టామినా ఏంటి అనేది ఆ సినిమాల ఓపెనింగ్స్ తెలియజేశాయి. సో, “మట్కా” సినిమాకి గనుక డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చినా చాలు అనుకుంటున్నారు నిర్మాతలు. వరుణ్ ఒకవేళ ఆ ఫీట్ అచీవ్ చేయగలిగితే ఆల్మోస్ట్ సక్సెస్ సాధించినట్లే.

తెలుగులో సోలో రిలీజ్, 1000కి పైగా స్క్రీన్స్, అన్నిటికీ మించి సోషల్ మీడియాలో మంచి బజ్. కంటెంట్ కరెక్ట్ గా కనెక్ట్ అయ్యి, డైరెక్టర్ కరుణకుమార్ (Karuna Kumar)  కాస్త ఎంగేజింగ్ గా సినిమాను నడిపించగలిగితే.. “మట్కా” హిట్టు కొట్టడం ఖాయం. మరి రిజల్ట్ ఏమవుతుందో తెలియాలంటే.. మరో రెండు రోజులు ఆగాల్సిందే.

 ‘కన్నప్ప’ డిసెంబర్ కి రాదట.. మంచు విష్ణు క్లారిటీ !

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.