March 23, 202508:25:17 AM

Krish Jagarlamudi: డైరెక్టర్ క్రిష్ మళ్ళీ పెళ్లి.. నిజమెంత?

టాలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించిన క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఎమోషనల్ టచ్ తో పాటు సామాజిక సందేశాలను అందిస్తాయి. ‘గమ్యం’ (Gamyam) , ‘వేదం’  (Vedam)  , ‘కంచె’ (Kanche) వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రాలతో పాటు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ (Gautamiputra Satakarni)వంటి చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్, బాలీవుడ్ లోనూ తన సత్తా చాటారు. క్రిష్ వ్యక్తిగత జీవితం గురించి రీసెంట్ గా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Krish Jagarlamudi

రెండో వివాహానికి సిద్ధమయ్యారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన అనుష్క తో ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. అదే సమయంలో క్రిష్ రెండో వివాహం పుకార్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. క్రిష్ ఫ్యామిలీ నుంచి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. క్రిష్ మొదటి పెళ్లి 2016లో రమ్య అనే డాక్టర్ తో జరిగిన విషయం తెలిసిందే.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట ఐదేళ్ల తర్వాత విడిపోయింది. ఇక అప్పటి నుంచి క్రిష్ సింగిల్ గానే ఉన్నారు. ప్రస్తుతం కొత్త జీవితం ప్రారంభించడానికి మరోమారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి కూడా ఒక డాక్టర్ అని, ఆమె హైదరాబాద్ కి చెందిన అమ్మాయి అని టాక్ వినిపిస్తోంది. ఎంగేజ్మెంట్ త్వరలో జరగనుందని.. డిసెంబర్ నెలలో పెళ్లి వేడుక ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది ఫ్యామిలీ నుండి అధికారికంగా ఏదైనా ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది. అయితే క్రిష్ మళ్ళీ వివాహ బంధంలోకి అడుగుపెడితే, సినీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారనుంది. ఇటీవల క్రిష్ హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

మేం ముగ్గురుం ఆయన చేతిలో దెబ్బలు తిన్నాం: వరుణ్‌ తేజ్‌!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.