March 18, 202505:58:48 PM

Krish Jagarlamudi: సింపుల్ గా క్రిష్ రెండో వివాహం.. ఫొటో వైరల్!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన చిత్రాలను అందించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)  తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు పెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రీతి చల్లా అనే డాక్టరును వివాహం చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన ప్రీతి చల్లా, గతంలో వివాహం చేసుకుంది కానీ పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు కొడుకు కూడా ఉన్నాడు.

Krish Jagarlamudi

క్రిష్ తన మొదటి భార్య రమ్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితంలో మరో మారు కొత్త ప్రస్థానానికి సిద్ధమయ్యాడు. ప్రీతి చల్లా కుటుంబంతో కలిసి చర్చలు జరిపిన తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. ఈ వివాహం హైదరాబాద్‌లోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. క్రిష్ కెరీర్ విషయానికి వస్తే, తెలుగు సినీ పరిశ్రమలో సామాజిక అంశాలు, వినూత్న కథాంశాలను ప్రధానాంశాలుగా తీసుకుని మెప్పించిన దర్శకుడిగా గుర్తింపు పొందాడు.

‘గమ్యం’ (Gamyam)  సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన క్రిష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ‘వేదం'(Vedam)  , ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (Krishnam Vande Jagadgurum), ‘కంచె’ (Kanche)  , ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ (Gautamiputra Satakarni) వంటి చిత్రాలతో తన సత్తా చాటాడు. బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన క్రిష్, అక్షయ్ కుమార్ హీరోగా ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహించినప్పటికి చివరలో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం క్రిష్ ‘ఘాటి’ సినిమా చేస్తున్నాడు. అనుష్క శెట్టి (Anushka Shetty)  ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం టీజర్ కూడా ఇటీవల విడుదలై ప్రేక్షకులలో మంచి ఆసక్తి రేపింది. అంతేకాకుండా, క్రిష్ పవన్ కళ్యాణ్‌తో  (Pawan Kalyan)  ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

 ‘పుష్ప’ ప్రచారం.. స్టార్‌ బ్రాండ్‌లతో మైత్రీ మూవీ మేకర్స్‌ డీల్సే డీల్స్‌!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.