March 23, 202508:17:12 AM

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి రీ ఎంట్రీ.. ఈసారి మరో ప్రయోగం!

టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి,(Lavanya Tripathi)  గత కొన్ని సంవత్సరాలుగా వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. పెళ్లి తరువాత సినిమాలు తగ్గించిన్నట్లు అనిపిస్తోంది. వరుసగా వచ్చిన ఆఫర్లతో కెరీర్ ప్రారంభంలోనే మంచి సినిమాలు చేసినా, ఈ మధ్యకాలంలో ఆమె ప్రాజెక్టులు తగ్గడం గమనార్హం. అటు పెళ్లి, ఇటు కొత్త ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం మరింత గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో (Varun Tej)  ఇటీవలే వివాహం చేసుకున్న లావణ్య, తన కెరీర్ విషయంలో ఇప్పుడు మరింత ఆచితూచి అడుగులు వేస్తోంది.

Lavanya Tripathi

ప్రత్యేకించి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కంటే లేడీ ఓరియెంటెడ్ కథలపై ఆమె ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆమె ఇటీవల పులి మేక (Puli Meka) , మిస్ పర్‌ఫెక్ట్ (Miss Perfect) వంటి వెబ్ సిరీస్‌లలో నటిస్తూ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ మీద కూడా తన ప్రతిభను ప్రదర్శించింది. ఇప్పుడు లావణ్య తన రీ ఎంట్రీ కోసం మరో ప్రయోగం చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘సతీ లీలావతి’ అనే టైటిల్‌తో ఓ కొత్త ప్రాజెక్ట్‌లో ఆమె ప్రధాన పాత్రలో నటించబోతోందట.

ఈ కథ ఆమె పాత్రకు మరింత బలాన్నిస్తూ, భార్యభర్తల సంబంధాల చుట్టూ అల్లుకుంటుందని టాక్. లావణ్య ప్రధానంగా ఈ సినిమాలో హైలైట్ అయ్యేలా స్క్రిప్ట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌లోని ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నిర్మించబోతోందట. కథలో ఆమె భర్త పాత్రలో టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో నటించనున్నట్లు సమాచారం. లావణ్య త్రిపాఠి భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ వెళ్తుండడం పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీస్తోంది.

ఈ సినిమాతో ఆమె ఫ్యాన్స్ కచ్చితంగా సరికొత్త లావణ్యను చూడబోతున్నారని అంటున్నారు. ‘సతీ లీలావతి’ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన త్వరలో రానుంది. పెళ్లి తర్వాత లావణ్య చేస్తున్న ఈ ప్రయోగం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడినట్లు కనిపిస్తోంది.

తమిళంలో మా సినిమాలకు స్క్రీన్స్ ఇవ్వరా?.. సూర్య ఏమన్నారంటే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.