March 21, 202503:16:59 AM

Mechanic Rocky Collections: టాక్ బాగున్నా.. జస్ట్ యావరేజ్ ఓపెనింగ్సే..!

మాస్ క దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen)  నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)  చిత్రం నిన్న అంటే నవంబర్ 22న రిలీజ్ అయ్యింది.మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath)..లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ సో సో గానే ఉన్నా.. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్..లు బాగున్నాయి అని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు.

Mechanic Rocky Collections:

కానీ ఓపెనింగ్స్ అయితే టాక్ కి తగ్గట్టు లేకపోవడం గమనార్హం. ఈ ఏడాది విశ్వక్ సేన్ నుండి వచ్చిన ‘గామి’ (Gaami)  ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari) సినిమాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ తో పోలిస్తే ‘మెకానిక్ రాకీ’ ఓపెనింగ్స్ తక్కువే. ఒకసారి (Mechanic Rocky) ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.48 cr
సీడెడ్ 0.17 cr
ఆంధ్ర(టోటల్) 0.66 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.73 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.04 cr

‘మెకానిక్ రాకీ’ చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మౌత్ టాక్ బాగా వచ్చినప్పటికీ.. మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.2.04 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.96 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘దేవకీ నందన వాసుదేవ’ కి మహేష్ రివ్యూ.. మండిపడుతున్న ఫ్యాన్స్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.