March 16, 202511:32:14 AM

Pongal Race: సంక్రాంతి బాక్సాఫీస్.. గొడవలు రాకుండా పర్ఫెక్ట్ డేట్స్!

టాలీవుడ్ లో సంక్రాంతి (Pongal) సీజన్ అంటేనే సినిమాల సందడి. ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద పెద్ద చిత్రాలు విడుదలవుతూ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తాయి. కానీ ఈసారి మాత్రం కొన్ని సినిమాల మధ్య డేట్స్ విషయంలో సమస్యలు తలెత్తే అవకాశముండగా, నిర్మాతలు ముందుగానే ఈ సమస్యను పరిష్కరించారు. తగినంత గ్యాప్ ఇచ్చి, గొడవలు రాకుండా పర్ఫెక్ట్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో మొదటగా రానున్న చిత్రం రామ్ చరణ్ (Ram Charan)  హీరోగా నటించిన “గేమ్ ఛేంజర్”  (Game Changer)  . శంకర్ (Shankar) డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pongal Race:

ఈ చిత్రం జనవరి 10న విడుదల కాబోతోంది. నిర్మాత దిల్ రాజు (Dil Raju) వీలైనంత ఎక్కువ థియేటర్స్ లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ (Nandamuri Balakrishna)  నటించిన ఎన్బీకే 109 కూడా సంక్రాంతి (Pongal) రేసులో బలంగా ఉంది. బాబీ  (Bobby) దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. బాలయ్య అభిమానులకి పండుగ వాతావరణం అందించే ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకులకి యాక్షన్ మరియు మాస్ ఎంటర్టైన్మెంట్ ని అందించే ఈ చిత్రం మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి.

వెంకటేష్ (Venkatesh)  హీరోగా అనిల్ రావిపూడి  (Anil Ravipudi) డైరెక్షన్ లో రూపొందిన “సంక్రాంతికి వస్తున్నాం”  (Sankranthiki Vasthunnam) చిత్రం జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం, సంక్రాంతి పండుగ రోజున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించనుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ పై ప్రేక్షకులలో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఇక యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ తో ఈ సినిమాను రూపొందించారు. మరొకవైపు, జనవరి 15న సందీప్ కిషన్ (Sandeep kishan) నటించిన “మజకా” కూడా విడుదల అవుతోంది.

త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు అనుకూలంగా రూపొందించారు. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కట్టిపడేసే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని అంటున్నారు. సంక్రాంతికి నాలుగు డిఫరెంట్ జోనర్ సినిమాలు విడుదల అవ్వడం తో, బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంటుందని అనిపిస్తోంది. మరి ఇందులో ఏ సినిమా ఎక్కువ స్థాయి లాభాలను అందుకుంటుందో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.