March 22, 202504:05:50 AM

Prabhas: ప్రభాస్.. ఆ ప్రాజెక్ట్ లతో 2000 కోట్లు పక్కా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  (Prabhas)  ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్నారు. ‘బాహుబలి’తో ఆయన స్టార్ డమ్ అంతకంతకు పెంచుకొని, ఇప్పుడు ‘సలార్’ ’(Salaar), ‘కల్కి 2898AD’ (Kalki 2898 AD) లాంటి భారీ చిత్రాలతో తన స్థాయిని మరింత పెంచుతున్నారు. ఇండియన్ బాక్సాఫీసు వద్ద 1000 కోట్ల క్లబ్‌ ఇప్పుడు ప్రభాస్ సినిమాలకు కామన్ అనే చెప్పాలి. ఇప్పటికే ‘బాహుబలి 2’, ‘సలార్’ లాంటి సినిమాలు ఆ స్థాయిలో బాక్సాఫీసు రికార్డులను కల్పించాయి.

Prabhas

ఇప్పుడు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లలో ప్రతి ఒక్కటీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నాయి. వీటిలో ‘ది రాజా సాబ్’ (The Rajasaab)  హర్రర్ కామెడీగా ఉండగా, హను రాఘవపూడితో (Hanu Raghavapudi) వున్న పీరియాడిక్ డ్రామా కూడా వెయ్యి కోట్ల మార్క్‌ని చేరే అవకాశం ఉంది. ఇక ‘స్పిరిట్’ ’ (Spirit) మూవీపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయి, ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంతో 1500 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. ఇంకా లోకేష్ కనగరాజ్‌(Lokesh Kanagaraj) తో ఓ ప్రాజెక్ట్‌పై కూడా ప్రభాస్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్‌కు ప్రఖ్యాతి సంపాదించుకున్న దర్శకుడు, ప్రస్తుతం రజనీకాంత్‌తో  (Rajinikanth)  ‘కూలీ’ (Coolie)  చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషించనున్నారు. ‘విక్రమ్’, ‘ఖైదీ’ వంటి చిత్రాలకు కొనసాగింపుగా ‘విక్రమ్ 2’ను కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ – ప్రభాస్ కలయికలో తెరకెక్కే ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో భారీగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక అది 2000 కోట్లకు పైనే రాబట్టే అవకాశం పుష్కలంగా ఉంటుంది.

ఇకపోతే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో కూడా మరో భారీ మైథలాజికల్ చిత్రంలో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ‘హనుమాన్’ సినిమా ద్వారా ప్రశాంత్ తన సత్తా చాటుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ కూడా 2 వేల కోట్ల కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసేలా ఉండే అవక్షన్ ఉంది. ఇలా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్‌లతో వెయ్యి నుంచి రెండు వేల కోట్ల వరకు కలెక్షన్లు సొంతం చేసుకునే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌లు సాధించిన విజయం ప్రభాస్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుందని చెప్పవచ్చు.

హీరోలు ఇక ఇలాంటి సినిమాలే తీసుకుంటే బాగుంటుందేమో?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.