March 20, 202502:27:16 PM

Samantha: బన్నీతో కలసి ఘాటు పెంచిన హనీ.. ఇలాంటి లుక్‌లో సమంతని చూసి!

పద్ధతైన చీరట్టులో ‘ఏ మాయ చేసావె’తో (Ye Maaya Chesave) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత (Samantha).. ఆ తర్వాత వెంటనే ‘బృందావనం’ (Brindavanam) సినిమాలో ట్రెండీ లుక్‌లో కిర్రెక్కించింది. ఆ తర్వాత కూడా రకరకాల లుక్కుల్లో లైక్‌లు సంపాదించింది. పెళ్లి అయిన తర్వాత రూటు పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు విడాకుల తర్వాత మరోసారి అందాల జాతరకు గేట్లు ఎత్తేసింది. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో వరుసగా హాట్‌ లుక్‌లు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు బయటికొచ్చిన ఫొటోలు వాటన్నింటికి బాప్‌ లాంటివి.

Samantha

మీరు సోషల్‌ మీడియాలో సమంతను ఫాలో అవుతున్న వారు అయితే.. ఆ ఫొటోలేంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. లేదంటే పైన చూసిన ఫొటో అందులో ఒకటి. ఇలాంటివి చాలానే ఉన్నాయి. తన కొత్త వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ బన్నీ’ ప్రచారంలో భాగంగా హీరో వరుణ్‌ ధావన్‌, సమంత ఫొటో షూట్‌ ఒకటి ఇచ్చారు. అందులో బ్లాక్‌ థై హై లాంగ్‌ ఫ్రాక్‌లో సమంత అదరగొట్టింది. అక్కడితో ఆగిపోయి ఉంటే ఓకే. ఆ హాXట్‌ డ్రెస్‌లో ఆమె వరుణ్‌ ఒడిలో కూర్చున్న ఫొటో కూడా ఒకటి ఆ లిస్ట్‌లో ఉంది.

ఆ లుక్‌లు చూసిన ఫ్యాన్స్‌ సమంత ఎంటి అంతాల మోత ఇంతలా మోగిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. ఫొటోల్లోనే ఇలా ఉంటే ఇక సిరీస్‌లో ఇంకెంత వడ్డించారో అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ సిరీస్‌ ఈ రోజు నుండే స్ట్రీమింగ్‌ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ వెబ్‌ సిరీస్‌ కథ సంగతి చూస్తే.. హనీ (సమంత) ఓ జూనియర్ ఆర్టిస్ట్. అవకాశాల కోసం సినిమా ఆఫీసులకు వెళ్లి ఆడిషన్స్ ఇస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో స్టంట్ మన్ బన్నీ (వరుణ్ ధావన్) (Varun Dhawan) పరిచయం అవుతాడు. బన్నీతో పరిచయం హానీ ప్రయాణాన్ని ఎలా మార్చింది. జూనియర్ ఆర్టిస్ట్ అయిన హనీ స్పై ఏజెంట్‌గా ఎలా మారింది. ఏజెంట్ అయ్యాక ఏం జరిగింది అనేదే కథ. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో ఈ రంగంలోనూ విజయం అందుకున్న సామ్‌.. ఈ సిరీస్‌తో మరింత పేరు తెచ్చుకోవడం ఖాయం అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

పవన్ ‘హరిహర వీరమల్లు’ మరింత డిలే.. ఏమైందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.