March 18, 202502:49:29 AM

షూటింగ్లో గాయపడ్డ నటుడు.. ట్రీట్మెంట్ తీసుకుంటూ?

సినిమా వాళ్ల జీవితాలు పైకి బాగానే కలర్ఫుల్ గా కనిపిస్తాయి. కానీ వాళ్లకు ఉండే కష్టాలు వాళ్ళకి ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్..లలో వీళ్ళు నటించేప్పుడు కొన్ని రిస్క్..లు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. మరీ రిస్కీ షాట్లు ఉంటే.. డూప్..లని వాడుకుంటారు. కానీ కొంతమంది నటీనటులు డూప్..లు లేకుండా యాక్షన్ సీక్వెన్సుల్లో నటించేస్తూ ఉంటారు. అలాంటి టైమ్లో కొంచెం ఇబ్బందులు కూడా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty).. యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించడానికి దూకుడు చూపిస్తుంటాడు.

Suniel Shetty

చాలా సార్లు ఇతను గాయపడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి ఇతనికి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తుంది. షూటింగ్లో భాగంగా అతను గాయపడ్డాడట. వివరాల్లోకి వెళితే.. సునీల్ శెట్టి నటిస్తున్న ‘హంటర్’ వెబ్ సిరీస్ షూటింగ్ ముంబైలో గ్యాప్ లేకుండా జరుగుతుంది. ఈ క్రమంలో సునీల్ శెట్టి పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా సునీల్ శెట్టి గాయపడినట్టు తెలుస్తుంది.

దీంతో అతని పక్కటెముకలకి గాయాలైనట్టు సమాచారం. వెంటనే హాస్పిటల్ కి చేర్పించి చికిత్స అందిస్తున్నారట. దీంతో సునీల్ శెట్టి ఫాలోవర్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 63 ఏళ్ళ సునీల్ శెట్టి హిందీలో హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని మంచి విజయాలు అందుకున్నాయి. తెలుగులో మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన ‘మోసగాళ్లు’ (Mosagallu) , వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘గని’ (Ghani) వంటి సినిమాల్లో నటించాడు.

అనుష్క ఇంత వైల్డ్ గా ఉందేంటి?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.