March 23, 202505:36:35 AM

Thandel: ‘తండేల్’.. చందూ మొండేటి అక్కడ నుండి లేపాడా.. క్రెడిట్స్ ఇస్తాడా?

నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి  (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా చందూ మొండేటి (Chandoo Mondeti)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’ (Thandel) . ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీత దర్శకుడు. ఇదిలా ఉండగా.. ‘తండేల్’ కథ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే ‘మున్నీటి గీత‌లు’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది అనేది ఇన్సైడ్ టాక్.

Thandel

చింత‌కింది శ్రీ‌నివాస‌రావు దీనికి రచయిత. మృత్య‌కారుల జీవనశైలి ని ఆధారం చేసుకుని ఈ నవలని రచించారు శ్రీనివాసరావు. పోలారావు చేపల వేటకు వెళ్తుంటాడు. బాగా డబ్బు సంపాదించి త‌న భార్య‌ని బాగా చూసుకోవాల‌న్నది అతని కల. దీని ఓసారి చేపల వేట కోసం గుజ‌రాత్ లోని అరేబియా స‌ముద్రానికి వ‌ల‌స‌ పోతాడు. ఇతనితో పాటు గ్రామస్తులు, తోటి జాలర్లు కూడా..! అయితే ఓ సందర్భంలో వీళ్ళు తప్పిపోతారు.

అదే టైంలో పాకిస్థాన్ సైన్యం కొంతమందిని అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురిచేస్తుంది. అందులో పోలా రావు కూడా ఉంటాడు. ఆ తర్వాత హీరో అలాగే అతని ఊరికి చెందిన వాళ్ళు ఎలా బయటపడ్డారు? చివరికి పోలారావ్.. ఎల్లమ్మని కలుసుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ. ‘మున్నీటి గీత‌లు’ కి తానా పురస్కారం కూడా లభించింది.

దర్శకుడు చందూ మొండేటి ‘మున్నీటి గీత‌లు’ రచయిత అనుమతితోనే ‘తండేల్’ ని తెరకెక్కిస్తున్నాడా? టైటిల్స్ లో అతనికి క్రెడిట్స్ ఇస్తారా? లేక ముందుగానే డబ్బులు ఇచ్చి సెటిల్ చేశారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఒకటైతే కన్ఫర్మ్. ‘మున్నీటి గీత‌లు’ ఆధారంగానే ‘తండేల్’ తెరకెక్కితే.. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది కొంతమంది మాట. చూద్దాం ఏమవుతుంది..!

‘లక్కీ భాస్కర్’ ..మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసింది..?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.