March 23, 202507:09:51 AM

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

Star Director MT Vasudevan Nair Passes Away (1)

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు చెందిన వారు ఎక్కువగా మరణించిన సంగతి తెలిసిందే.అనారోగ్య సమస్యలతో కొంతమంది, వయోభారంతో బాధపడుతూ ఇంకొంత మంది, దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురై.. మరికొంత మంది ఇలా ఎవరొకరు మరణవార్త వింటూనే ఉన్నాం. ఇటీవల చూసుకుంటే.. మళయాళ సీనియర్ నటి మీనా, భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra) సోదరుడు నందు, దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెన‌గ‌ల్ వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదాల నుండి ఇంకా కోలుకోకుండానే మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది.

MT Vasudevan Nair

Star Director MT Vasudevan Nair Passes Away (1)

మలయాళ సినీ పరిశ్రమలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంటీ(MT) వాసుదేవన్ నాయర్ (MT Vasudevan Nair) మృతి చెందారు. ఆయన వయస్సు 90 ఏళ్ళు అని తెలుస్తుంది. వయోభారంతో పాటు కొన్నాళ్లుగా శ్వాసకోశ వంటి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారట. ఈ క్రమంలో డిసెంబర్ 15న కోళికోడ్‌లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో ఆయనను కుటుంబ సభ్యులు జాయిన్ చేశారట.

చికిత్స పొందుతూనే ఈయన బుధవారం నాడు అంటే డిసెంబర్ 25న రాత్రి ఆయన (MT Vasudevan Nair) తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. స్వతహాగా రచయిత అయినటువంటి వాసుదేవన్ పలు సినిమాలకు పని చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత ఆయన ఆరు సినిమాలకు దర్శకత్వం వహించారు.జ్ఞానపీఠ్‌తో పాటు పద్మభూషణ్‌ వంటి పురస్కారాలు ఆయన్ను వరించాయి. ఇక వాసుదేవన్ (MT Vasudevan Nair) మృతికి చింతిస్తూ మలయాళ సినీ పరిశ్రమకు చెందిన వారు సంతాపం తెలుపుతున్నారు.

మొత్తానికి ‘హనుమాన్’ వివాదాన్ని బయటపెట్టిన హీరోయిన్.. ఇన్స్టా స్టోరీ వైరల్..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.