March 20, 202512:29:03 PM

Anirudh: నాని హిట్ కాంబో నుంచి అనిరుధ్ అవుట్.. ఏమైందంటే..!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani), అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) కాంబినేషన్ లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్ విషయంలో ఒక మార్పు జరిగింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ‘దసరా’తో (Dasara)  భారీ విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనిరుధ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Anirudh

అనిరుధ్ ఇప్పటికే పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో సంగీతాన్ని అందిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో అతని ప్రాజెక్టులు హవా కొనసాగుతున్నాయి. నాని కోసం ఈ ప్రాజెక్ట్‌కి ఒప్పుకున్నప్పటికీ, తన షెడ్యూల్ క్లాష్ అవడం వల్ల అనిరుధ్ తప్పుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అనిరుధ్ స్థాయికి తగ్గటువంటి కొత్త సంగీత దర్శకుడిని తీసుకోవాలని చిత్ర బృందం కసరత్తు మొదలుపెట్టింది. ‘ది ప్యారడైజ్’ ఒక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో సంగీతం ఈ కథలో కీలక పాత్ర పోషించనుంది.

ప్రముఖ నటులు మోహన్ బాబు (Mohan Babu) , రమ్యకృష్ణ (Ramya Krishnan) ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వారి పాత్రలు సినిమాకు మరింత స్థాయి తీసుకువస్తాయని భావిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రీప్రొడక్షన్ దశలోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇకపోతే నాని ప్రస్తుతం తన ‘హిట్ 3’ షూటింగ్‌ను పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ప్రారంభమవ్వదు.

ఈ గ్యాప్‌లోనే కొత్త సంగీత దర్శకుడిని ఫైనల్ చేయడానికి యూనిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాని మాత్రం ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అనిరుధ్ అవుట్ అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. నాని క్రేజ్, శ్రీకాంత్ ఓదెల టాలెంట్ కలిసి ఈ సినిమాను మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలబెడతాయనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.