March 18, 202503:04:07 PM

Pushpa 2 The Rule: 1000 కోట్ల క్లబ్ లెక్క మారింది.. టాప్ లిస్ట్ ఇదే!

ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పుష్ప మరో కొత్త రికార్డును అందుకుంది. కేవలం ఆరు రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ మార్క్‌ను చేరి, ఇండియన్ సినిమాల్లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న  (Rashmika Mandanna)  నటనకు, సుకుమార్ (Sukumar) దర్శకత్వ ప్రతిభకు ఈ ఘనత దక్కింది. పుష్ప 1 (Pushpa)  క్రేజ్‌పై నిలబడి, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మనసులను దోచిన ఈ సినిమా, ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసింది. ఇప్పటివరకు 1000 కోట్ల క్లబ్‌లో బాహుబలి 2 (Baahubali2) 10 రోజుల్లో చేరింది.

Pushpa 2 The Rule

ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ (RRR), కేజీఎఫ్ 2 (KGF 2) సినిమాలు 16 రోజుల్లో ఈ రికార్డ్ ను అందుకున్నాయి. బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) జవాన్ (Jawan) 18 రోజుల్లో ఈ మైలురాయిని దాటగా, పఠాన్ 27 రోజుల్లో ఆ ఘనత సాధించింది. కానీ పుష్ప 2 కేవలం ఆరు రోజుల్లోనే ఈ క్లబ్‌లో చేరి, బాహుబలి 2తో ప్రారంభమైన టాలీవుడ్ డామినేషన్‌కు మరో రికార్డ్ ను జోడించింది. సుకుమార్ పుష్ప 2ను  (Pushpa 2: The Rule) పాన్ ఇండియా ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించాడు.

అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో చూపించిన మాస్ పెర్ఫార్మెన్స్, గంగాలమ్మ ఎపిసోడ్, బీజీఎం, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు పుష్ప 1 విజయంతో ఏర్పడిన క్రేజ్ చాలా పెద్ద ప్లస్ అయ్యింది. హిందీలో ఈ చిత్రం మొదటి భాగం కంటే 2.5 రెట్లు ఎక్కువ కలెక్షన్లు రాబడుతోంది. 1000 కోట్ల క్లబ్‌లో పుష్ప 2 అతి వేగంగా చేరడంతో టాలీవుడ్ స్థాయి పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ఈ సినిమా సాధించిన విజయం భవిష్యత్తులో ఇతర ఇండియన్ సినిమాలకు మార్గదర్శకంగా ఉంటుంది. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించిన పుష్ప 2 (Pushpa 2 The Rule), ఈ లెక్కను ఇంకా ఎటువైపు తీసుకెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక 1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ కొత్త రికార్డుతో, టాలీవుడ్ తక్కువ సమయంలోనే బాలీవుడ్‌ను అధిగమించగలగిందని మరోసారి నిరూపించుకుంది.

నాని హిట్ కాంబో నుంచి అనిరుధ్ అవుట్.. ఏమైందంటే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.