March 25, 202510:25:30 AM

Atlee Kumar: స్టార్‌ డైరక్టర్ అయ్యాక.. షర్ట్‌ రేటు మారిందిగా.. లేటెస్ట్ షర్ట్‌ లెక్క వామ్మో

Director Atlee Kumar T-Shirt Price Details Goes Viral in Social Media (1)

సింగిల్‌ సినిమా స్టార్‌ డైరక్టర్‌ అయిపోయినవాళ్లు మన దగ్గర చాలా తక్కువ. అందులో స్టార్‌ హీరోతో ఆ సినిమా తీయకుండా స్టార్‌ డైరక్టర్‌ అయినవాళ్లు ఇంకా తక్కువ. ఇలాంటి ఫీట్‌ అందుకున్న దర్శకుల్లో అట్లీ (Atlee Kumar)  ఒకరు. 2013లో తమిళంలో విడుదలైన ‘రాజా రాణి’ (Raja Rani) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అట్లీ. ఆ తర్వాత విజయ్‌తో వరుస సినిమాలు చేసి స్టార్‌ దర్శకుడు అయిపోయారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు.

Atlee Kumar

Director Atlee Kumar T-Shirt Price Details Goes Viral in Social Media (1)

ఇప్పుడు అతని గురించి ఎందుకు, కొత్త సినిమాలు ఇంకా చెప్పలేదు, రచయితగా కథ ఇచ్చిన సినిమా ఫలితం తేడా కొట్టేసింది అనుకుంటున్నారా? ఆయన సినిమా ఫలితం తేడా కొట్టేసి ఉండొచ్చు.. ఆయన వేసుకున్న షర్ట్‌ మాత్రం సూపర్‌ హిట్‌ అయింది. ‘తెరి’  (Theri) సినిమా రీమేక్‌ ‘బేబీ జాన్‌’ (Baby John) ప్రచారంలో భాగంగా ఇటీవల అట్లీ ముంబయిలో తెగ తిరిగారు. ఈ క్రమంలో ఆయన ధరించి ఓ నలుపు రంగు టీ షర్ట్‌ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

Givenchy కంపెనీకి చెందిన ఆ టీషర్ట్‌కి చాలా హోల్స్‌ ఉంటాయి. అవి చూసి ఇదేంటి అనుకోవద్దు. అదో డిజైన్‌ అంతే. ఆ సంగతి పక్కనపెడితే ధర అయితే షాక్‌ పుట్టిస్తుంది. ఎందుకంటే ఆ టీ షర్ట్ ధర రూ. 1,12,000 కాబట్టి. ప్రస్తుతం ఈ సమాచారం, షర్ట్‌ ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కోలీవుడ్‌లో సాధారణ యువకుడిలా కనిపించిన అట్లీ.. ఇప్పుడు ఖరీదైన టీషర్ట్‌లు వేయడం చూసి.. ఎదుగుదల అంటే ఇలా ఉండాలి అని అంటున్నారు నెటిజన్లు.

Atlee reacts to Baby John facing tough competition from Pushpa 2 (1)

ఇక అట్లీ (Atlee) సంగతి చూస్తే.. విజయ్‌ (Vijay Thalapathy) సినిమాలు ‘తెరి’, ‘మెర్సల్’ (Mersal), ‘బిగిల్’తో (Bigil) స్టార్‌ అయిపోయారు. ఆ సినిమాలతో తమిళంతోపాటు తెలుగు, హిందీలోనూ పాపులర్ అయ్యారు. అదే ఆయనకు షారుఖ్‌ ఖాన్‌తో (Shah Rukh Khan) ‘జవాన్‌’  (Jawan) సినిమా చేసే ఛాన్స్‌ ఇప్పించింది. ఆ సినిమా రూ.1000 కోట్లకు సంపాదించడంతో.. తర్వాతి సినిమాను సల్మాన్‌ ఖాన్‌తో (Salman Khan) చేసే అవకాశం వచ్చింది.

తెగ తాగేవాడిని.. నన్ను మార్చిందదే: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.