March 25, 202510:41:28 AM

తెగ తాగేవాడిని.. నన్ను మార్చిందదే: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

Star Hero Aamir Khan opens up about early days struggle in film career (1)

బాలీవుడ్‌ ఆ మాటకొస్తే మొత్తం ఇండియన్‌ సినిమాకు మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అంటే ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)  పేరు గుర్తొస్తుంది. సినిమాల కోసం ఆయన పడే కష్టం, ఎంతటి బాధనైనా, ఇబ్బందినైనా వెరవని తనం ఆయనకు ఆ పేరు తెచ్చిపెట్టింది. నిజ జీవితంలో ఆయన వేసిన అడుగులు కాస్త అటు ఇటు ఉన్నాయి అనుకోండి. అయితే ఇదంతా ఇప్పుడు, ఒకప్పుడు ఆయన నిజ జీవితంలో ఇంతకుమించి అడుగులు అటు ఇటు వేశాడు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు.

Aamir Khan

Star Hero Aamir Khan opens up about early days struggle in film career (1)

నానా పటేకర్‌తో కలసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్‌ ఖాన్‌ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తన పర్సనల్‌ లైఫ్‌లో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్స్‌కి మాత్రం కరెక్ట్‌ టైమ్‌కి వెళ్లేవాడినని తెలిపారు. వ్యసనాల విషయానికొస్తే పైప్‌ స్మోకింగ్‌, మద్యపానం ఉండేవి అని చెప్పుకొచ్చాడ. అయితే తప్పు చేస్తున్నాని ఒకానొక సమయంలో గ్రహించినా ఫుల్‌స్టాప్‌ పెట్టలేకపోయా అని చెప్పాడు.

అయితే అలా ఉన్న తనను మార్చించి మాత్రం సినిమానే అని చెప్పుకొచ్చాడు ఆమిర్‌ ఖాన్‌. సినిమా మెడిసిన్‌ లాంటిదని అన్నాడు. గతంలో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఫలితం తర్వాత ఒక్కసారి పాజ్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఇకపై ఏడాది ఒక సినిమా కచ్చితంగా చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.

‘లాల్‌ సింగ్‌ చద్దా’ (Laal Singh Chaddha) తర్వాత చాలా గ్యాప్‌ ఇచ్చి ‘సితారే జమీన్‌ పర్‌’ అనే సినిమా స్టార్ట్‌ చేశాడు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉంది. నిర్మించిన ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies)  ఆస్కార్‌ ప్రచారం పెద్ద ఎత్తున చేసినా షార్ట్‌ లిస్ట్‌ అవ్వలేదు. ఇక రజనీకాంత్‌ (Rajinikanth) ‘కూలి’ (Coolie)  సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఇది కాకుండా లోకేశ్‌ కనగరాజ్‌తో (Lokesh Kanagaraj) డైరెక్ట్‌ మూవీ ఒకటి చేయాలని అనుకుంటున్నాడు. ఇక తన కలల ప్రాజెక్ట్‌ ‘మహాభారతం’ అని ఇప్పటికే ప్రకటించాడు ఆమిర్‌.

హీరోయిన్లతో స్టార్‌ హీరో సరసాలు.. క్లారిటీ అయితే ఇచ్చాడు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.