March 23, 202507:01:44 AM

హీరోయిన్లతో స్టార్‌ హీరో సరసాలు.. క్లారిటీ అయితే ఇచ్చాడు!

Star Hero Varun Dhawan Breaks Silence On Allegations About Crossing A Line With His Female Co-Stars (1)

సినిమా పరిశ్రమలో మహిళలు – వేధింపులు.. గత కొన్ని రోజులుగా ఈ విషయం గురించి దేశంలో ఏదో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంది. కొన్ని తాజాగా జరిగిన ఘటనలు అయితే, మరికొన్ని ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగాయి అని చెబుతున్నారు. దీంతో మహిళల భద్రత అనే అంశం మీద పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో స్టార్‌ హీరో ఒకరు.. హీరోయిన్ల ప్రైవేటు పార్టులను తాకుతున్నాడు అనే విమర్శలు వచ్చాయి. అయితే వీటిపై ఆ హీరో క్లారిటీ ఇచ్చాడు.

Varun Dhawan

Star Hero Varun Dhawan Breaks Silence On Allegations About Crossing A Line With His Female Co-Stars (1)

బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) గురించి చాలా రోజులుగా సోషల్‌ మీడియాలో ఇబ్బందికర ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఓ ఈవెంట్‌లో ఆలియా భట్‌ను (Alia Bhatt) అభ్యంతరకరంగా తాకాడని, ఓ సినిమా షూటింగ్‌లో కియారా అడ్వాణీని (Kiara Advani) అందరి ముందు ముద్దు పెట్టాడు అని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై వరుణ్‌ ఫైనల్లీ స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

షూటింగ్‌ సమయంలో అందరితో ఒకేలా ఉంటాను. నా సహనటులతో సరదాగా ఉండటానికి ప్రయత్నిస్తాను. అయితే నేను చేస్తున్న పనులతో ఇబ్బంది పడుతున్నట్లు ఎవరూ నా దగ్గర అనలేదు. ఇప్పటికైనా విమర్శలపై నన్ను ప్రశ్నలు అడిగినందుకు సంతోషంగా ఉంది అని మీడియాతో అన్నాడు వరుణ్‌. అలా అయినా రూమర్స్‌ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం వచ్చింది అని చెప్పాడు.

కియారా అడ్వాణీని తాను ఉద్దేశపూర్వకంగా ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్‌ ఫొటో షూట్‌లో భాగంగా అలా చేశానని చెప్పాడు. అంతేకాదు ఆ క్లిప్‌ను తాను, కియారా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశామని కూడా చెప్పాడు. ఇదంతా తాము ప్లాన్‌ చేసి చేసినదే అని చెప్పాడు. ఇక ఆలియా తనకు మంచి స్నేహితురాలని, ఆ రోజు సరదాగా అలా చేశానని చెప్పాడు. అంతేకాదు అది సరసాలాడటం కాదని తేల్చేశాడు.

ఇక వరుణ్‌ సినిమాల సంగతి చూస్తే.. ‘బేబీ జాన్‌’ (Baby John) అనే పిక్చర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రముఖ దర్శకుడు అట్లీ (Atlee Kumar) తెరకెక్కించిన తమిళ చిత్రం ‘తెరి’కి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాతో కాలిస్‌ (Kalees) దర్శకుడిగా బాలీవుడ్‌కి వెళ్లారు. కీర్తి సురేశ్ (Keerthy Suresh) కూడా బీటౌన్‌ హీరోయిన్‌గా మారింది. కానీ సినిమా యాజ్‌ యూజువల్‌ బాలీవుడ్‌కి దెబ్బేసింది.

సినీ పెద్దలకి షాకిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.