March 18, 202502:38:57 PM

సినీ పరిశ్రమలో విషాదం.. బలగం నటుడు కన్నుమూత!

Balagam Mogilaiah

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. తాజాగా బలగం నటుడు మరణించడంతో ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి. ‘బలగం’ సినిమాలో జానపద కళాకారుడిగా కనిపించి పాపులర్ అయ్యాడు మొగిలయ్య. ఆ సినిమాలో కొమురయ్య చనిపోయాక కాకి పిండం ముట్టే టైమ్లో ఇతను పాడే పాట అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.

Balagam Mogilaiah

ఇదిలా ఉంటే.. ఈరోజు ఆయన మృతి చెందారు. అందుకు కారణం ఈయనకు కిడ్నీలు ఫేయిల్యూర్ అవడం అని తెలుస్తుంది. అందువల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు సమాచారం.దీంతో వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వచ్చారు.ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో గురువారం నాడు తెల్లవారు జామున మరణించినట్టు తెలుస్తుంది.

ఆయన హాస్పిటల్లో ఉన్న టైమ్లో చికిత్స కోసం ‘బలగం’ డైరక్టర్‌‌ వేణు యెల్ధండి, చిత్ర యూనిట్ సభ్యులు ఆర్ధిక సాయం చేశారని తెలుస్తుంది. ప్రభుత్వం కూడా స్పందించి సాయం చేయడం జరిగిందని సమాచారం. అయినా లాభం లేకపోయింది.

ఇక బలగం 2023 మార్చ్ నెలలో రిలీజ్ అయ్యింది. పెద్దగా చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ద్వారా వేణు టాప్ రేంజ్ కి వెళ్లిపోయారు. ఇందులో నటించిన నటీనటులు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత వారికి వరుస అవకాశాలు లభించాయి. అయితే మొగిలియ్యని మాత్రం అనారోగ్య సమస్యలు డెబ్భై తీశాయి అని స్పష్టమవుతోంది.

లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.