April 2, 202502:32:50 AM

Game Changer: గేమ్ ఛేంజర్ లో రియల్ ఇన్సిడెంట్స్!

Game Changer based on real incidents in Telugu states

సూపర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” (Game Changer) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar)  అత్యున్నత స్థాయి సాంకేతిక నైపుణ్యాలతో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అమెరికాలో డల్లాస్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ మూవీ ప్రమోషన్లకు శుభారంభాన్ని ఇచ్చింది. ఈ ఈవెంట్‌ను డిస్టిబ్యూటర్ రాజేష్ భారీ స్థాయిలో నిర్వహించారు. కార్యక్రమంలో రామ్ చరణ్ స్టేజ్‌పై ప్రత్యేకంగా డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.

Game Changer

Game Changer based on real incidents in Telugu states

మేకర్స్ ఈ చిత్రానికి గణనీయమైన బడ్జెట్‌ను ఖర్చు చేస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు (Dil Raju)  మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించామని, ఆ సంఘటనలు ప్రేక్షకులకు చాలా దగ్గరగా అనిపిస్తాయని తెలిపారు. “శంకర్ గారు నాలుగేళ్ల క్రితమే స్క్రిప్ట్ రాసిన ఈ సంఘటనలు ఇప్పుడు నిజమైన ఫీల్ ను కలుగజేశాయి. ప్రేక్షకులు ఈ చిత్రంలో కనిపించే అంశాలకు క్లాప్ కొడతారని నమ్ముతున్నాను,” అని ఆయన వ్యాఖ్యానించారు.

Game Changer based on real incidents in Telugu states

ఈ సినిమాలో హైవోల్టేజ్ సామాజిక అంశాలు ప్రాధాన్యం పొందినట్లు తెలుస్తోంది. శంకర్ తన దృష్టిలోని పవర్ఫుల్ రైటర్‌ను బయటకు తీసుకువచ్చి, ప్రజా జీవితంలో కీలకమైన అంశాలను ఆధారంగా చేసుకుని కథ రాశారని సమాచారం. “భారతీయుడు”(Bharateeyudu ) లాంటి విజయాన్ని మరలా శంకర్ అందుకుంటాడని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక “ఆర్ఆర్ఆర్” (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సోలో ప్రాజెక్ట్ కావడంతో “గేమ్ ఛేంజర్”పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

Game Changer Movie 1st Review by Director Sukumar1

ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ తన మార్కెట్‌ను మరింతగా స్థిరపరచుకునే అవకాశముంది. ముఖ్యంగా, ఈ చిత్రం కథనం సరికొత్తగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే సాంగ్స్ కొన్ని.పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక సినిమా ట్రైలర్ ను జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఎన్టీఆర్ వార్ 2 .. ఎంతవరకు వచ్చిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.