March 30, 202508:20:28 PM

Game Changer First Review: గేమ్ ఛేంజర్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..హైలైట్స్ ఇవే!

Game Changer Movie 1st Review by Director Sukumar1

మెగా ఫ్యామిలీకి మరో భారీ విజయం అందించే అవకాశమున్న సినిమా ‘గేమ్ చేంజర్(Game Changer) .’ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల డల్లాస్‌లో జరిగింది. ఈ ప్రత్యేక ఈవెంట్‌కు ‘పుష్ప 2’తో (Pushpa 2: The Rule)  బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. సినిమా ఎలా ఉంది అనే సందేహాలకు ఆయన అద్భుతమైన రివ్యూ ఇచ్చేశారు. సుకుమార్ మాట్లాడుతూ, ‘‘గేమ్ చేంజర్‌ను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi)  కలిసి చూశాను.

Game Changer First Review:

Game Changer Movie 1st Review by Director Sukumar1

సినిమా ప్రతీ ఒక్కరిని కదిలించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్. క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది’’ అని తెలిపారు. అంతేకాదు, రామ్ చరణ్ (Ram Charan) తన పెర్ఫార్మెన్స్‌తో అవార్డులను దక్కించుకునే స్థాయిలో నటించారని చెప్పారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో రికార్డ్ గా నిలుస్తుందని సుకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డైరెక్టర్ శంకర్‌ (Shankar) సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి.

Game Changer Movie 1st Review by Director Sukumar1

కానీ ‘ఇండియన్ 2’ (Bharateeyudu 2)  సినిమా అనుకున్న స్థాయిలో రీచ్ కాకపోవడంతో కొందరు ఫ్యాన్స్ టెన్షన్‌కు గురయ్యారు. కానీ శంకర్ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపిస్తారని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకుల పాత్రలో కనిపించబోతున్నారు. తండ్రిగా ఒక రాజకీయ నాయకుడి క్యారెక్టర్, కొడుకుగా ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర చరణ్ నటనలో కొత్త కోణాలను చూపించనుందని సమాచారం.

ఈ సినిమాలో (Game Changer) హీరోయిన్లుగా కియారా అద్వానీ (Kiara Advani) , అంజలి (Anjali) నటించగా, విలన్‌గా ఎస్.జె. సూర్య (SJ Suryah) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. డల్లాస్ ఈవెంట్ ద్వారా ఫ్యాన్స్‌లో హైప్ మరింత పెరిగింది. సినిమా థియేటర్‌కు వస్తే మరింత సందడి క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.