March 19, 202512:54:52 PM

Ghaati Movie: అల్లు అర్జున్, అనుష్క సినిమాలకి పోలిక అదేనట..!

Similarities in between Pushpa and Ghaati movie

అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ (Pushpa)  ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. దర్శకుడు సుకుమార్ గతంలో తీసిన సినిమాలు అన్నీ క్లాస్ టచ్ ఉన్నవి. కానీ ‘పుష్ప’ ప్రాజెక్టు కోసం తన పంథాను మార్చుకుని.. రూటెడ్ ఎమోషన్స్ తో ‘పుష్ప’ కథని డిజైన్ చేసుకున్నాడు. మొదటి భాగం అంతా హీరో ఎదుగుదల, రెండో భాగం అంతా అతని రూలింగ్ పై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా ‘పుష్ప’ కథ గురించి చెప్పాలంటే ‘ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ వ్యక్తి కథ’ అని చెప్పాలి.

Ghaati Movie

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. అల్లు అర్జున్ బాటలోనే అనుష్క కూడా నడుస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. విషయం ఏంటంటే.. అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రలో ‘ఘాటి’  (Ghaati) అనే సినిమా రూపొందుతుంది. దీని కథ కూడా ‘పుష్ప’ కి చాలా సిమిలర్ గా ఉంటుందట. ఈ సినిమాలో అనుష్క గంజాయి స్మగ్లర్ గా కనిపించబోతుందట. అవును.. గంజాయి స్మగ్లింగ్ చేసే ఓ గిరిజన యువతి.. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యలను ఆధారం చేసుకుని ‘ఘాటి’ చిత్రాన్ని తెరకెక్కించాడట దర్శకుడు క్రిష్.

దీనికి రివెంజ్ టచ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో ఏప్రిల్ 18న విడుదల కాబోతుంది ‘ఘాటి’ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘రాబిన్ హుడ్’ నిర్మాతలకి పెద్ద తలనొప్పే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.