‘కింగ్’ నాగార్జున (Nagarjuna) టాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుల్లో కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna) ఒకడు. 2015 లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ (Soggade Chinni Nayana) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ కృష్ణ. ఆ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎగబడి చూశారు. బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఈ సినిమా. దీని తర్వాత నాగ చైతన్యతో (Naga Chaitanya) ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్లోనే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ (Rarandoi Veduka Chudham) అనే సినిమా చేశాడు.
Kalyan Krishna
ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో టాప్ లీగ్లోకి ఎంట్రీ ఇస్తూ రవితేజతో (Ravi Teja) ‘నేల టిక్కెట్టు’ (Nela Ticket) అనే సినిమా చేశాడు. ఇది అంతగా ఆడలేదు. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణకి ‘వెంకీ మామ’ (Venky Mama) సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించింది. కానీ ఊహించని విధంగా ఆ ప్రాజెక్ట్ నుండి అతను మధ్యలోనే తప్పుకోవడం జరిగింది. ఆ వెంటనే ‘బంగార్రాజు’ (Bangarraju) సినిమాపై వర్క్ చేయడం మొదలుపెట్టాడు.
2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఏకైక పెద్ద సినిమా ‘బంగార్రాజు’ నే..! కోవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ‘బంగార్రాజు’ సినిమాని ప్రేక్షకులు బాగానే చూశారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ రేంజ్లో కాకపోయినా ఇది కూడా సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తున్నా కళ్యాణ్ కృష్ణ తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టలేదు. మధ్యలో జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
కానీ ఆ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. తర్వాత మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నట్టు టాక్ వినిపించింది. మెగాస్టార్ 156 వ సినిమాని కళ్యాణ్ కృష్ణనే డైరెక్ట్ చేస్తున్నాడని అంతా అనుకున్నారు. చిరు పెద్ద కుమార్తె సుస్మిత (Sushmita Konidela) ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు కూడా సెట్ అవ్వలేదు. మరి 2025 లో అయినా కళ్యాణ్ కృష్ణ నెక్స్ట్ సినిమా గురించి ప్రకటన వస్తుందేమో చూడాలి.