April 1, 202501:39:40 AM

నా డ్యూటీ నేను చేస్తున్నాను.. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Dilraju comments goes viral about Allu Arjun issue

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అదీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. తెలుగు సినీ పరిశ్రమ నుండి ఆయనను కలిసి అభినందించడానికి వెళ్లిన వాళ్ళ సంఖ్య బాగా తక్కువ. చిరంజీవి (Chiranjeevi) , రాంచరణ్ (Ram Charan) , మహేష్ బాబు (Mahesh Babu) వంటి వారు ఓ సందర్భంలో వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసొచ్చారు. దీంతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలు.. టాలీవుడ్ ను ఫోకస్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు అంతా అనుకుంటున్నారు.

ఇందులో భాగంగా.. నాగార్జున (Nagarjuna) ఎన్-కన్వెన్షన్ ను హైడ్రా పేరుతో కూల్చేశారని, తర్వాత అల్లు అర్జున్.. ని టార్గెట్ చేశారని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్  (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  సక్సెస్ మీట్లో ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడంతో.. ఆయన అహం దెబ్బతింది’ అని కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. దీంతో రేవంత్ ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కోపాన్ని చల్లార్చి టాలీవుడ్ ను కాపాడేది ఎవరు అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Another Proof on Allu Arjun Negligence on Sandhya Theater Issue (3)

ఇలాంటి టైంలో దిల్ రాజు (Dil Raju) పైనే భారమని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే దిల్ రాజు ఇప్పుడు ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌) ఛైర్మ‌న్‌. ఆయన్ని ఏరికోరి ఎంపిక చేసింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే..! సో ఇప్పుడు టాలీవుడ్ కి పెద్ద దిక్కు దిల్ రాజు అనే చెప్పాలి. ఆల్రెడీ దిల్ రాజు తోటి టాలీవుడ్ పెద్దలతో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళదామని అందరినీ ప్రేరేపిస్తున్నారు అని వినికిడి.

టాలీవుడ్ కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం కావాలి అనే అంశంపై కూడా ఎఫ్.డి.సి చైర్మన్ గా దిల్ రాజు చర్చించబోతున్నట్టు వినికిడి. ఈ విషయం పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోపక్క సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని కూడా దిల్ రాజు పరామర్శించి వచ్చారు. ‘రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడతాం’ అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.