March 18, 202502:49:26 AM

Mega Family: చిక్కడపల్లి పోలీసుల పుణ్యమా అని చెరిగిపోయిన చీలికలు!

అల్లు అర్జున్ (Allu Arjun)  నంద్యాల వెళ్ళినప్పటినుండి మెగా ఫ్యామిలీలో చీలికలు ఏర్పడ్డాయనేది ఓపెన్ సీక్రెట్. అందుకే “పుష్ప 2” (Pushpa 2: The Rule) అంత పెద్ద హిట్ అయినా కూడా మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా కనీసం ట్వీట్ కూడా వేయలేదు. సక్సెస్ మీట్ లో బన్నీ “థ్యాంక్స్ కళ్యాణ్ బాబాయ్” (Pawan Kalyan)  అన్నప్పటికీ పెద్దగా ఉపయోగపడలేదు. అయితే.. ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం హుటాహుటిన చిరంజీవి (Chiranjeevi)  తన “విశ్వంభర” (Vishwambhara)  షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని మరీ అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడం, అన్నయ్య వెళ్లిన అరగంటకి తమ్ముడు నాగబాబు (Naga Babu) కూడా బన్నీ ఇంటికి చేరుకున్నాడు.

Mega Family

ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ (Mega Family) నడుమ చీలికలు చెరిగిపోయాయి అని అభిమానులు ఆనందపడుతున్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీద ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో.. సాయంత్రంలోపు బన్నీకి బెయిల్ వస్తే బెటర్ లేదంటే రెండు రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇకపోతే..

ఇండియావైడ్ సూపర్ హిట్ కొట్టిన “పుష్ప 2” సక్సెస్ ను ఢిల్లీలో మీటింగ్ పెట్టుకొని మరీ ఎంజాయ్ చేసిన బన్నీని ఆ ఆనందం నుండి తేరుకొనేలోపే పోలీసులు బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం అనేది కాస్త ఓవర్ అయ్యింది. ఈ విషయంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మరియు పరభాషా నటులు అల్లు అర్జున్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి రంగలోకి దిగి బన్నీని త్వరగా ఇంటికి చేరుకునేలా చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

 విశ్వంభర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ హుటాహుటిన బన్నీ ఇంటికెళ్లిన చిరంజీవి!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.